Telugu News

తమ్ముడా..! నాతో వచ్చినా.. ప్రాణం దక్కేదేమో..!!

బోరున విలపించిన యంపి మాలోత్ కవిత

0

తమ్ముడా..! నాతో వచ్చినా.. ప్రాణం దక్కేదేమో..!!

బోరున విలపించిన యంపి మాలోత్ కవిత..

(మహబూబాబాద్- విజయం న్యూస్)

తమ్ముడు రవి.. వెహికిల్ ఎక్కురా.. ఈరోజు చాలా పెళ్ళిల్లు ఉన్నాయి వెల్దాం అన్నాను.. అక్కా.. వెనుక బండ్లో ఎక్కివస్తా అంటూ రవి వెల్లాడు.. అవే..వాడి ఆఖరి మాటలు అవుతాయనుకోలేదు.. రవి నువ్వు నాతోపాటు వచ్చినా.. ఈ..ప్రమాదం తప్పేదేమో.. నీ..ప్రాణాలు దక్కేవేమో అంటూ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కౌన్సిలర్ రవి మృతదేహం వద్ద బోరున విలపించింది. ఉదయం ఇంటికి వచ్చాడు.. సిసిరోడ్డు పనుల ప్రారంభంలో తనతోపాటు పాల్గొన్నాడు. రవి .వచ్చి కొబ్బరికాయకొట్టరా.. అంటే నవ్వుతూ..వచ్చి కొబ్బరికాయ కొట్టాడు.ఈరోజు జిల్లాలో చాలా కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉండడంతో బయలుదేరుతున్న క్రమంలో రవినికూడా.. రమ్మన్నాను..రవి నవ్వుతూనే.. చిన్నపని ఉందక్కా.. చూసుకొని వస్తా అన్నాడు..

also read;-అక్రమంగా నిల్వ.ఉంచిన రేషన్ బియ్యాన్ని..!!

నర్సింహులపేట మండలంలో ఉండగా ఈ..విషాదవార్త తెలిసింది.. దిగ్బ్రాంతికి గురయ్యానని యంపి కవిత కంటతడి పెట్టుకున్నారు. వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి వచ్చాను.. *కొన్ని గంటలక్రితం అక్కా..అంటూ నవ్వుతూ మాట్లాడిన రవి.. శవంగా కనిపించడం.. దారుణహత్యకు బలవ్వడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని యంపి కవిత కన్నీటిపర్యంతం అయ్యారు.