అధికారుల నిర్లక్ష్యం వలన ఉపాధి మహిళ నిండు ప్రాణం పోయింది…!
---మాలోత్ సోల్తా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
అధికారుల నిర్లక్ష్యం వలన ఉపాధి మహిళ నిండు ప్రాణం పోయింది…!
—మాలోత్ సోల్తా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
—-కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టెభోయిన శ్రీనివాస్
(మహబూబాబాద్- విజయం న్యూస్);-
అధికారుల నిర్లక్ష్యం వలన ఉపాధి హామీ పనుల వద్ద విషాదం నెలకొన్నదని ఉపాధి కూలీ మహిళ నిండు ప్రాణం పోయిందని ఉపాధి హామీ కూలి మలోత్ సోల్తా కు 20 లక్షల ఏక్స్ గ్రేషియా అందించి ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని సీపీఐ అనుబంధ వ్యవసాయ సంఘము జిల్లా అధ్యక్షుడు వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్,డిమాండ్ చేశారు.
also read :-ఆర్వోబి నిర్మాణం ఎప్పుడు…?
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని చిన్న కృష్టాపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద విషాదం చోటు చేసుకుంది. కూలీ పనులకు వెళ్లిన మలోత్ సోల్తా (55) అనే మహిళా ఎండదెబ్బకు మృతి చందగా సీపీఐ మండల పార్టీ ఆధ్వర్యంలో నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా కట్టెభోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించ వలసి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం పోయిందని. దీనికి ప్రభుత్వం, మండల అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటికైనా మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు కావలిసిన కనీస సౌకర్యాలు మంచినీరు.మెడికల్ కిట్, నీడ కొరకు టెంటు,లను ఏర్పాటు చేయాలని వైస్ ఎంపీపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టెభోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు.