అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు…!
(మహబూబాబాద్- విజయం న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.గంగారం మండలం లోని మడ గూడ గ్రామం నుండి టాటా ఇండికా కార్ లో రెండు లక్షల విలువచేసే టేకు కలపను తరలిస్తున్నారని పక్కా సమాచారంతో కాపు కాసిన అటవీశాఖ అధికారులు తిరుమల గండి వద్ద కారు ఆపగా కార్ డ్రైవర్ పరారయ్యాడు.ఈ కారులో దాదాపు రెండు లక్షల విలువచేసే టేకు కలప స్వాధీనం చేసుకొని కొత్తగూడ ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు.
also read :-ఇలాంటి కేసులు మన తెలుగు రాష్ట్రంలో నమోదు కావాలి..!
ఈ అక్రమ దందా చేస్తున్నావారు నర్సంపేట కు చెందిన వారిగా అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ దాడిలో అధికారులు యండి మక్బూల్ అలీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోతగూడ, ఎఫ్ బి ఓ వెంకన్న, ఎనిమల్ ట్రాకర్ శివ, సతీష్, దేవ్ సింగ్, స్టాలిన్ వంశీ పాల్గొనారు. అక్రమంగా కలపను తరలిస్తున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సిబందిని కొత్తగూడ ఎఫ్ అర్ ఓ వజాహత్ అభినందించారు.