బస్తర్ ఫైటర్స్ రిక్రూట్‌మెంట్‌పై మావోయిస్టుల ఆగ్రహం
– ఓర్చా – నారాయణపూర్ రోడ్డు ధ్వంసం
– బస్తర్ ఫైటర్స్‌లో చేరవద్దని యువతకి పిలుపు
(ఛత్తీస్‌గఢ్ – విజయం న్యూస్):-
ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ ఫైటర్స్ రిక్రూట్‌మెంట్‌పై మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్థానిక యువతకు 2800 నుంచి 3000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బస్తర్ ఫైటర్స్ పేరుతో స్పెషల్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ చేస్తోంది. దీనికి అక్కడి యువత నుంచి స్పందన లభిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బస్తర్ ఫైటర్స్ ద్వారా జరగబోయే నష్టాన్ని ముందే పసిగట్టిన మావోయిస్టులు రిక్రూట్‌మెంట్‌ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. బస్తర్ ఫైటర్స్‌లో ఆదివాసీ యువత చేరవద్దని హెచ్చరికలు చేస్తూ మావోయిస్టులు నారాయణపూర్ – ఓర్చా రహదారిని త్రవ్వి ధ్వంసం చేసి అలజడి సృష్టించారు. పూర్తిగా రోడ్డు పాడవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయినవి. ఈ ఘటనని అదనపు ఎస్‌పి నీరజ్ చంద్రకర్ ధృవీకరించారు.
also read :-కేంద్రం సంచలన నిర్ణయం..
బస్తర్ ఫైటర్స్ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్‌ను యువత వ్యతిరేకించాలని కోరుతూ బస్తర్ డివిజన్ పరిథిలో మావోయిస్టులు చాలా చోట్ల బ్యానర్లు, పోస్టర్లు వేశారు. ఈ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి బస్తర్ యోధులను వ్యతిరేకించాలని మావోయిస్టులు లేఖ వదిలినట్లు సమాచారం. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమై గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. బస్తర్ డివిజన్‌లో పోలీసులకు, మావోయిస్టులకు నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.