Telugu News

కోడలిపై హత్యాయత్నం

పట్టపగలే ఆఘాయిత్యం

0

కోడలిపై హత్యాయత్నం

** పట్టపగలే ఆఘాయిత్యం

** సిద్దిపేటలో కలకలం..

** పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

(సిద్దిపేట-విజయంన్యూస్)
తండ్రిలాంటి మామ చేయలేని పని చేశాడు.. సభ్యసమాజం తలదించుకునే పని చేశాడు.. బిడ్డలా చూసుకోవాల్సిన మామ కర్కసుడైయ్యాడు.. కన్నుమిన్ను కానక కోడలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో పట్టపగలే చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పట్ట పగలు ఇద్దరు చిన్న పిల్లల తల్లిపై అత్తింటి వారు హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు సంచలనం రేపింది. తనకు రక్షణ కల్పించి అత్తింటి వారి అదనపు కట్నం వేధింపుల నుంచి కాపాడాలని పోలీసులను ఆశ్రయించింది.

also read :-అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం…సిద్దిపేట పట్టణం లోని రంగదాంపల్లికి చెందిన గద్వాల ఆనంద్ రెడ్డితో దూల్మిట్టకు చెందిన డి. శ్రీనిధికి 2016లో పెళ్లి జరిగింది. పెళ్లి సందర్భంగా రూ.10 లక్షల నగదు, మరో రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కట్న కానుకలు గా ఇచ్చారు. ఏడాది పాటు సజావుగానే శ్రీనిధి కాపురం కొనసాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. భర్తతో పాటు అత్త మంగమ్మ, మామ కృష్ణారెడ్డి, మరిది సురేందర్ రెడ్డి, ఆడపడుచు అనిత లు శ్రీనిధిని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించసాగారు.

also read :-తెలంగాణ‌లోనే రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ‌
అయినా శ్రీనిధి అత్తింటి వేధింపులను దాదాపు నాలుగున్నర ఏళ్లుగా భరించింది. అయితే ఈనెల 28వ తేదీన అత్తింటి వారు మరోసారి వేధింపులకు గురి చేయడంతో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
తాను రేపు ఉదయం బంధువులను తీసుకుని వస్తున్నానని శ్రీనిధితో ఆమె తండ్రి సత్యారెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని సత్యారెడ్డి అల్లుడు ఆనంద్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. అయితే విషయాన్ని తల్లిదండ్రులకు ఎందుకు చెప్పావని శ్రీనిధిని భర్త ఆనంద్ తోపాటు అత్త మంగమ్మ, మామ కృష్ణారెడ్డి ప్రశ్నిస్తూ మళ్లీ వేధింపులకు పాల్పడ్డారు.

also read :-కౌలురైతుల ఆత్మహత్యలపై అబద్దాలా?

ఈ సందర్భంగా 29వ తేదీన మధ్యాహ్నం ప్రాంతంలో భర్త, అత్త, మామలు కలిసి దిండుతో తనను చంపడానికి ప్రయత్నించారని శ్రీనిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను ప్రతిఘటిస్తున్న సమయంలోనే తన తల్లి, తండ్రి, బంధువులు చేరుకున్నారని, వాహనాల సౌండ్ విని అత్త, మామలు ఇంటి నుంచి వెళ్లిపోయారని, భర్త నుంచి తప్పించుకుని తాను అప్పుడే చేరుకున్న తన తల్లి, దండ్రుల వద్దకు వెళ్లినట్లు శ్రీనిధి వివరించారు అయితే తనకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ తన అత్తింటికి పంపడానికి తల్లి, తండ్రితో పాటు బంధువులు ప్రయత్నిస్తున్నారని, దీంతో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను బహిర్గతం చేశానని బాధితురాలు శ్రీనిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

తమపై హత్యాయత్నం చేసిన భర్త, అత్త, మామల నుంచి ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. అంతేగాక అదనపు కట్నం కోసం తనను హింసించిన మరిది, ఆడ పడుచు పైనా చర్యలు తీసుకోవాలని శ్రీనిధి గురువారం మద్దూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన సిద్దిపేటలో తీవ్ర సంచలనం కలిగించింది.