కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ
టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ
* టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
(శ్యామ్ నాగార్జునసాగర్ ప్రతినిధి, విజయం న్యూస్);-
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నందికొండ మున్సిపాలిటీ లోని 9వ వార్డులో కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 50 ముస్లిం కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
also read;-సత్తుపల్లిలో విద్యార్థుల ఫైట్
ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రమేష్ జీ, నాయకులు మసీదు రాము, విక్రమ్ చంద్రమౌళి, మోహన్ నాయక్, గడ్డ మీద రవి, హనుమంతు, సైదులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు