Telugu News

గార్లలో కనుల పండువగా తెప్పోత్సవం

శ్రీదేవి భూదేవి దేవేరులతో కోనేరులో విహరించిన స్వామి వారు

0

కనుల పండువగా తెప్పోత్సవం

• శ్రీదేవి భూదేవి దేవేరులతో కోనేరులో విహరించిన స్వామి వారు

• భక్తులతో కిటకిటలాడిన మర్రిగూడెం ఆలయం

(గార్ల-విజయంన్యూస్)

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పరిధిలోని మర్రిగూడెం సమీపంలోని శ్రీ వేట వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన శనివారం స్వామివారి తెప్పోత్సవం ఆలయ ప్రధానార్చకులు ఆలయం ఎదుట ఉన్న కోనేరులో తెప్పో త్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం జరిగాక మూడో రోజున తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన శకటంపై ప్రతిష్టించి కోనేరులో తెప్పోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల నుండి భక్తులు వేలాదిగా హాజరయ్యారు.

ఆలయ కమి టీ చైర్మన్ భూక్యా కస్నానాయక్ ఆధ్వర్యంలో తెప్పోత్సవం నిర్వహించగా గార్ల బయ్యారం సిఐ తిరుపతి ఎస్సై బాదావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూడు శివాజీచౌహాన్, జెడ్పీటీసీజాటోత్ ఝాన్సీలక్ష్మి, సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ పిఎసిఎస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్ చిలక నరసయ్య పరుచూరి కుటుంబరావు బి.మల్లిబాబు, పుల్లఖండం రమేష్ బాబు, భూక్యా హరి, జాటోత్ వీరన్న టిటిడి ధర్మప్రచార కమిటీ సభ్యులు, భూక్యా రాములు, బాదావత్ చంటి, శ్రీనివాస్ గుప్తా, పబ్బిశెట్టి రంగారావు, ఊరుగొండ పాండు, కోట వెంకన్న దీన్ దయాల్ . అర్చకులు రామాయణం మధు స్వామి అచ్యుత్ ఆచార్య. గోవింద్ స్వామి ప్రవీణ్ స్వామి సత్యనారాయణ రమేష్ తదితరులు పాల్గొన్నారు

ALSO READ :- హాట్ కేక్ లా అమ్ముడుపోయిన ‘తిరుపతి’ దర్శనం టిక్కెట్లు

‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’