Telugu News

గోదావరి ఉగ్రరూపం

ఉదయానికి 50.00 అడుగులకు చేరిన నీటిమట్టం

0

గోదావరి ఉగ్రరూపం

== పెరుగుతున్న గోదరమ్మ వరద ఉదృతి

==ఉదయానికి 50.00 అడుగులకు చేరిన నీటిమట్టం

== మరింత పెరిగే అవకాశం

== అప్రమత్తమైన అధికారులు.. ప్రజలకు సూచనలు

== రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు

== అధికారులతో మాట్లాడి సూచనలు చేసిన మంత్రి పువ్వాడ

== ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచిన

(రిపోర్టర్- పెండ్ర అంజయ్య)

ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 12(విజయంన్యూస్)

గోదావరి మరోసారి ఉగ్రరూపం చూపించే అవకాశం కనిపిస్తోంది.. ఇటీవలే జూలై మాసంలో గోదారమ్మ మహోగ్రరూపం చూపించి 70.30 అడుగుల వరద వచ్చి గోదావరి పరివాహక ప్రాంతాలను ముంచేసిన సంగతి పాఠకులకు తెలిసిందే.. మరో సారి గోదావరమ్మ తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమైనట్లే కనిపిస్తోంది.. ఎగువున కురుస్తున్న వర్షాలకు వచ్చే వరదతాకిడికి గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు మెండుగా

 కనిపిస్తున్నాయి. అంత పెద్ద మొత్తంలో కాకపోయిన సుమారు 60 అడుగుల వరకు వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్రమేపి పెరిగి క్రమేపి తగ్గే అవకాశాలున్నాయి.దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు, ముంపు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బూర్గంపాడు ఎస్టి గురుకుల ఆశ్రమ పాఠశాలలో దారుణం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే బంగాళఖాతంలో ఏర్పడిన నైరూతి రుతుపవనాల కారణంగా గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్తర, దక్షణ తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ చెరువులు, కుంటలు అలుగులు పడుతుండటంతో చిన్నతరహా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాయి. కాగా సోమవారం రాత్రి 9గంటల సమాయానికి భద్రాచలం వద్ద 46.70 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. సోమవారం ఉదయం 8గంటల సమాయానికి 39.50 అడుగులు గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతూ రాత్రి సమయానికి 46.70 అడుగులకు చేరింది. అంటే సుమారు 12గంటల వ్యవధిలోనే 7అడుగుల నీటిమట్టం పెరిగింది.  మంగళవారం ఉదయం 7గంటల సమయానికి 50 అడుగులకు పెరిగింది. 24గంటల్లో 10అడుగులకు పెరిగింది.  మరింత పెరిగే అవకాశం ఉందని  అధికారులు చెబుతున్నారు.

== రెండవ ప్రమాద హెచ్చరిక జారీ 

భద్రాచలం వద్ద గోదావరి ఉద్రిత్తి మరింత పెరుగుతుండటంతో పాటు 50 అడుగులకంటే ఎక్కువగా వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం రాత్రి 10గంటల వరకు 48 అడుగుల మేర ప్రవహించగా మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించిన అధికారులు, ఆ వరద ప్రవాహం మరింత పెరిగి 50 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

== అప్రమత్తమైన అధికారులు

గోదావరి ఎగువ ప్రాంతాల్లో వస్తున్న వరదల కారణంగా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని భావించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధికారులు, కలెక్టర్ అనుదీఫ్ సంబంధిత అధికారులందర్ని అప్రమత్తం చేశారు. గత రెండు రోజుల నుంచే జిల్లా కలెక్టర్ అనుదీఫ్ పత్రికల ద్వారా, మీడియా ద్వారా, మైకుల ద్వారా గోదావరి పరివాహిక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి: క్షీరమా…కాలకోట విషమా..?

భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని, గోదావరి మరింతగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాధికారులను అప్రమత్తం చేశారు. అలాగే గోదావరి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం అసెంబ్లీ అవరణం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ముంపు ప్రాంతాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చిన్న ప్రాణహాని, అస్తినష్టం కూడా జరగకుండా ముంపు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఉంచాలని సూచించారు.