Telugu News

నిత్యశోధన చేసే విద్యార్థులదే విజయం

అడిషనల్ డీసీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ మధుసూధనరావు

0

నిత్యశోధన చేసే విద్యార్థులదే విజయం
– అడిషనల్ డీసీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ మధుసూధనరావు
– ఘనంగా బొమ్మ వార్షికోత్సవ వేడుకలు
(ఖమ్మం-విజయంన్యూస్)
నిత్యం శోదించి, సేదించే విద్యార్ధులు ఎప్పుడు పై చేయ్యి సాధిస్తారని, తద్వారా విజయం సాధిస్తారని, విద్యార్థులు ఎప్పుడు కూడా నూతన విషయాలను ఎల్లప్పుడు నేర్చుకుంటూనే ఉండాలని అడిషనల్ డీసీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ మధుసూధనరావు అన్నారు. బుధవారం నగరంలోని బొమ్మ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను తోలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చదువుతో పాటు వ్యక్తిత్వం ముఖ్యమని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేలా లక్ష్యసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టా అందుకున్న అనంతరం ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిర పడేందుకు ప్రయత్నించడంతో పాటు, సామాజిక సేవకు కృషి చేయాలన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని, ఇదే రీతిలో చదువులో కూడా రాణించాలని సూచించారు. విన సోంపైనా పాటలతో .. కళ్ళు చెదిరే నృత్యాలతో ..చూడముచ్చటైనా వస్త్రాలంకరణతో విద్యార్ధులు సందడి చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన వేదికపై పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో, డీజే వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్ని అంటాయి.

allso read -కిందపడిన విద్యార్థిని..రక్షించిన కానిస్టెబుల్, ఆర్టీసీ సిబ్బంది
జాతీయ సమైక్యతను చాటుతూ విద్యార్థులు ప్రదర్శించిన సందేశాత్మక, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆటా పాటలతో హుషారెత్తించారు. ఫ్యాన్సీ డ్రస్ అదరహో అనిపించారు. తమ కళలతో కళాశాలకే మరింత అందాన్ని తెచ్చారు. ఈ వేడుకల్లో బొమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సత్య ప్రసాద్, కార్యదర్శి శ్రీధర్, ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.