Telugu News

వానోచ్చిన వదులుడే లేదు

నిండు వర్షంలో బంద్ పాటిస్తున్న అఖిలపక్షం

0

వానోచ్చిన వదులుడే లేదు

— నిండు వర్షంలో బంద్ పాటిస్తున్న అఖిలపక్షం

–ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్

— బస్స్ డీపోల వద్ద నిండు వర్షంలో ధర్నా చేస్తున్న అఖిలపక్షం

(ఖమ్మం- విజయం న్యూస్)

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న, అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక చట్టాలను, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా అఖిలపక్ష ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒకవైపు జోరు వాన కురుస్తున్నప్పటికీ అఖిలపక్ష పార్టీల నాయకులు బస్ డిపోల వద్ద  ధర్నా నిర్వహిస్తున్నారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మండల కేంద్రాలలో దుకాణాలను మూసివేయించారు. ప్రజలు ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

పోటో : opఖమ్మం డీపో వద్ద జోరు వానలో ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులు

వ్యాపారులు, ప్రైవేటు సంస్థల యజమానులు, కాంట్రాక్టర్లు, కార్మికులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. బస్ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లకుండా అఖిలపక్ష పార్టీల నాయకులు బస్ డిపో వద్ద ధర్నా చేపట్టారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లన్ని బోసిపోతున్నాయి.

aldo read: పోట్ల శ్రీకాంత్ ఘన విజయం