Telugu News

లక్ష్మీదేవిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి.

0

లక్ష్మీదేవిపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం ఇంటర్ విద్యార్థి మృతి.

(భద్రాద్రికొత్తగూడెం-విజయం న్యూస్ ):

లక్ష్మీదేవి పల్లి మండలం వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి చరణ్ అనే ఇంటర్ విద్యార్థి స్కూటీపై వెళుతు ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాద సమయంలో చరణ్ హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు తలపై నుండి వెళ్లేసరికి హెల్మెట్ కూడా అతని ప్రాణాలను కాపాడ లేకపోయింది.ఉదయాన్నే తండ్రి నరసింహ కాలేజీలో దింపి వెళ్లిపోయిన అప్పటికీ క్లాసులు నడుస్తున్న సమయంలో చరణ్ బయటికి ఎలా వచ్చాడు అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది.

ఇది కూడా చదవండి :  ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు
ఇదిలా ఉండగా ఘటనా స్థలంలో రక్తపుమడుగులో పడివున్న చరణ్ డెడ్ బాడీని అంబులెన్స్ లోకి ఎక్కించడానికి ఎవరు ముందుకు రాకపోగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీనివాస్ తానే స్వయంగా డెడ్ బాడీని అంబులెన్స్ లోకి ఎక్కించి రోడ్డుపై రక్తపు మడుగును మట్టి వేసి శుభ్రంచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.