Telugu News

*నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు: మంత్రి పువ్వాడ.

◆ రూ.91 లక్షల్లతో నిర్మించిన ఆరు రోడ్లు ప్రారంభం.

0

*నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు: మంత్రి పువ్వాడ.

◆ రూ.91 లక్షల్లతో నిర్మించిన ఆరు రోడ్లు ప్రారంభం.

(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్)

ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ లో ప్రజలకు అన్ని వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో వివిధ డివిజన్లలో ఆధునిక టెక్నాలజీతో ఆరు రోడ్లకు గాను మొత్తం రూ.91 లక్షలతో నిర్మించిన Vaccum Dewatered Flooring(VDF) రోడ్స్ ను మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

◆ 20వ డివిజన్ మమత రోడ్ నందు రూ. 12.50 లక్షలు,

◆ 21వ డివిజన్ 5-ఎలిమెంట్స్ వద్ద రూ.18.30లక్షలు, శ్రీచైతన్య పాఠశాల రోడ్ రూ.17.50లక్షలు, రూ. 4.00 లక్షలు.

◆ 50వ డివిజన్ లో రూ. 16.20లక్షలు, రమణగుట్ట లో రూ.22.50లక్షలతో నిర్మించిన రోడ్డు ను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు(SDF) రూ.30 కోట్ల నిధుల నుండి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 41 డివిజన్లలో 140 రోడ్స్ ఏర్పాటు చేయనున్నమన్నారు.

also read :-‘పాలేరు’ లో మరో రాఘవుడున్నాడా..?

ఖమ్మం కార్పొరేషన్ మొత్తం అవసరమైన చోట ప్రతి రోడ్డు ను సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు.

ప్రజలకు నిత్యం అవసరమయ్యే రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పించమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ బచ్చు విజయ్ గారు, ఏఎంసీ చైర్మన్ ప్రసన్న లక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు && కమర్తపు మురళి, ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, రాపర్తి శరత్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, నాయకులు పగడాల నాగరాజు, ఆర్ జేసీ కృష్ణ తదితరులు ఉన్నారు..

also read :- నేనున్నానని భరోసా నింపే నాయకుడు మన ఎంపీ నామ