Telugu News

★ తెలుగువారి ప్రచండ భేరి ఎన్టీఆర్:- మంత్రి పువ్వాడ

★ కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించాలి

0

★ తెలుగువారి ప్రచండ భేరి ఎన్టీఆర్:- మంత్రి పువ్వాడ

★ కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించాలి

★ నేడు నటరత్న ఎన్టీఆర్ 26వ వర్ధంతి

నటరత్న, తెలుగుతేజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రచండ భేరి ఎన్టీఆర్ అని మంత్రి అజయ్ పేర్కొన్నారు

also read :-చంద్రబాబు కు కరోనా పాజిటివ్..*

దేశం గర్వించే నేత, తెలుగుజాతికి వన్నె తెచ్చిన ఎన్టీఆర్ కు దేశ అత్యుత్తమ పురస్కారమైన భారత రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవశ్యకత ఉందన్నారు.

నాడు తెలంగాణ ప్రజలను నిలువునా దోచేస్తున్న పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు స్వాతంత్య్రం మరోమారు తెచ్చిన గొప్ప ఘనుడు ఎన్టీఆర్ అని తాలూకా వ్యవస్థకు చరమగీతం పాడి మండల వ్యవస్థను స్థాపించి ప్రజల వద్దకు పాలన తెచ్చిన వ్యక్తి అని మంత్రి పువ్వాడ కొనియాడారు

also read:-అబుదాబి విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి

ఎన్టీఆర్ శిష్యుడిగా ఆయన పాలనకు తలదన్నేలా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకమైన పాలన చేపట్టారన్నారు. పేదలు, రైతులకు పాలనలో మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఎన్టీఆర్ రీతిలోనే నేడు సీఎం కేసీఆర్ సైతం ఎన్నో పేద, రైతు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు

భారత దేశ చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజలు, రాజకీయ వ్యవస్థలు ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు పేరు మారుమోగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.