Telugu News

పండగ పూట రెండు గ్రామల మద్య ఘర్షణ..

*రాళ్లు, కర్రలతో పరస్పర దాడి*

0

పండగ పూట రెండు గ్రామల మద్య ఘర్షణ..

*రాళ్లు, కర్రలతో పరస్పర దాడి*

*ఆరుగురికి గాయాలు*

*పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు*

*ఇరు వర్గాలతో మాట్లాడిన డీఎస్పీ… ఉపేందర్ రెడ్డి*

 

(దస్తూరాబాద్ – విజయం న్యూస్)

మండల కేంద్రం లోని కోమురం బీమ్ చౌరస్తా వద్ద శనివారం మండలంలోని ఎర్రగుంట మున్యాల తండా గ్రామాలకు చెందిన లంబాడ సామాజికవర్గానికి చెందినవారు సేవాలాల్ జగదాంబ దేవి ఆలయ నిర్మాణం కొరకు జగదాంబ దేవి సేవాలాల్ జెండాలను ఆవిష్కరించారు. మండల కేంద్రానికి చెందిన గ్రామస్తులు ప్రతి ఏటా దసరా నవరాత్రి రోజున జమ్మి ఉత్సవాన్ని జరుపుకుంటామని ఈ జమ్మి ఉత్సవంలో గ్రామానికి చెందిన వారందరూ పాల్గొంటారని ఆ స్థలం మండల కేంద్రానికి చెందిన ప్రజలకు సరిపోవటం లేదని దానిలోనే జగదాంబ దేవి సేవాలాల్ దేవాలయాలను నిర్మించడం కుదరదని గ్రామస్తులు తెగేసి చెప్పడంతో బంజరా వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఒకరినొకరు తోసుకుంటూ జెండాలను తొలగించారు. రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో దాడికి దిగారు ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి దస్తురాబాద్ ఎస్సై జ్యోతి మణి కడం ఎస్ ఐ రాజు సిబ్బందితో చేరుకొని ఇరువర్గాలను శాంతింప చేసిన వినకపోవడంతో ఖానాపూర్ సిఐ అజయ్ బాబు ఖానాపూర్ ఎస్ఐ అదనపు బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

also read :-కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దాం

ఇరు వర్గాలతో మాట్లాడిన డీఎస్పీ… ఉపేందర్ రెడ్డి*

బంజారా వర్గం మండల కేంద్రానికి చెందిన గ్రామ ప్రజల మధ్య జరిగిన ఘర్షణ పై డిఎస్పి ఉపేందర్ రెడ్డి ఇరు వర్గాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇరువర్గాలను శాంతింప చేస్తూ దస్తురాబాద్ గ్రామం ఎర్రగుంట గ్రామం బంజారా నాయకుల ఒప్పందం మేరకు 15 రోజులలో మండల కేంద్రంలో జగదాంబ దేవి సేవాలాల్ ఆలయ నిర్మాణానికి భూమిని అందజేయనున్నట్లు తెలిపారు. మండల తహసిల్దార్ ఆలయ నిర్మాణానికి కావలసిన భూమిపై వివరణ కోరి ప్రభుత్వ అనుమతితో ఆలయానికి భూమిని మంజూరు చేయుటకు ఇరు గ్రామాల సర్పంచులు నాయకులు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.