Telugu News

17 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన. 12 ఏళ్ల బాలుడు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక..!!

(తమిళనాడు విజయం న్యూస్):-

0

17 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన. 12 ఏళ్ల బాలుడు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక..!!

(తమిళనాడు విజయం న్యూస్):-

తమిళనాడులోని తంజావూరు లో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివాహం కాకుండానే గర్భం దాల్చింది ఓ బాలిక. విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి పెట్టింది.వారం క్రితం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది ఓ 17 ఏళ్ల బాలిక.అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ 12 ఏళ్ళ బాలుడిని అరెస్టు చేశారు.వివరాల్లోకెళ్తే…తంజావూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక..అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు..బడి మానేసి ఇంట్లోనే ఉంటున్నారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు.అయితే ఆ బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఏప్రిల్ 16న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలికను గర్భవతి గా తేల్చారు.అదేరోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది.

also read :-కేకే ఇన్ర్ఫాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తో పంపిణి

అయితే వివాహం కాకుండానే పాపకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్న వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.ఇంటి సమీపంలో ఉండే ఓ 12 ఏళ్ల బాలుడు తనపై తరచూ అత్యాచారానికి పాల్పడడంతో గర్భం దాల్చినట్లు తన వాంగ్మూలంలో తెలిపింది.బాలిక ఫిర్యాదు మేరకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద -2012 (POSCO ACT) ఆ బాల నేరస్తుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.అయితే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బాలుడిని అరెస్టు చేసినప్పటికీ, మరెవ్వరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.