Telugu News

ఖమ్మం సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం : మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి

0

ఖమ్మం సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం : మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం సమగ్ర అభివృద్ధే నా లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం కార్పొరేషన్ 4వ డివిజన్ లోని మంచికంటి నగర్, రాజీవ్ నగర్ గుట్ట నందు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ కాల్వల పనులకు మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి శంకుస్థాపన చేశారు.రఘునాధపాలెం మండలం కోయచెలక క్రాస్ రోడ్డు వద్ద ఊట్ల దీప్తి గారి జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం మొక్కలు పంపిణి ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయడమే కాకుండ, ఖమ్మం నగరాన్ని, ఖమ్మం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని అన్నారు. ఇప్పటికి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సర్పంచ్ శారద, ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ నర్సింహారావు, కాంపాటి పిచ్చయ్య, ఊట్ల లెనిన్ కుమార్, నాలబోతు రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

also read;-ములుగు జిల్లాలో కిడ్నాఫ్ కలకలం.. ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..?