Telugu News

మేడారం జాతర ఏర్పాట్లు,నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,సత్యవతి రాథోడ్ సమీక్ష

మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలి

0

మేడారం జాతర ఏర్పాట్లు,నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,సత్యవతి రాథోడ్ సమీక్ష

మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలి

ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలి

పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలి

గ‌తంలో కంటే మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అధికారులు కృషి చేయాలి

(ములుగు బ్యూరో విజయం న్యూస్):-

మేడారం జాతర పనులను పరిశీలించిన అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు ఎమ్మెల్యే సీతక్క.సమీక్ష సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని,వాటిని ఈసారి అధిగమించేలా చూడాలి.తాగునీటి, పారిశుద్ధ్యం,వసతి, ఇతర సొకర్యాలపై దృష్టి సారించాలిసామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకెడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు దృష్టి సారించాలి.ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చూడాలి.జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని,స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద త‌గిన ఏర్పాట్లు చేయాలి.

ర‌హ‌దారుకిరువైపుల ఆర్ అండ్ బీ అధికారులు సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాలి.భ‌క్తుల ర‌ధ్దీకి అనుగుణంగా ప్ర‌త్యేక క్యూ లైన్ల‌ను ఏర్పాటు చేయాలి.పార్కింగ్ ఇబ్బందులు తలెత్త‌కుండా పోలీసులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొవాలి.పోలీసు ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలి.మన ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో జాతరకు వచ్చే భక్తులకు అలాంటి ఏర్పాట్లు చేయాలి.జాతర అనంతరం చెత్త తొలగింపు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.జనవరి 15 లోగా పనులు పూర్తి అయ్యేలా ఆధికారులు పని చేయాలి.ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగు జాతర లో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లతో జరగాలి.
మేడారం జాతర ఏర్పాట్లను అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌,న్యాయ‌, హా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప‌రిశీలించారు.జంపన్న వాగు వ‌ద్ద నిర్మించిన‌ స్నానఘట్టాలను,షేడ్లను,ఇత‌ర ప‌నుల‌ను మంత్రులు పరిశీలించారు.అంతకు ముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క,దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య,జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఏఎస్పీ సుదీర్ ఆర్ కేకన్ ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిదులు,అధికారులు పాల్గొన్నారు.

also read :-*రైతులకోసం జనవరి 9నుంచి పాదయాత్ర చేస్తా: భట్టి