Telugu News

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం

== 18వ అంతస్థులో మంటలు

0

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం
== 18వ అంతస్థులో మంటలు
== ఇద్దరు సజీవ దహనం..ఐదుగురు చికిత్స పొందుతూ మృతి
== పదుల సంఖ్యలో క్షతగాత్రులు
(ముంబయి-విజయంన్యూస్)
ముంబై మహానగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 20 అంతస్తుల అపార్ట్‌మెంట్లోని 18వ అంతస్తుల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దాహనమైయ్యారు. ఐదుగురు చికిత్స పొందుతూ మృతిచెందగా, మొత్తం ఏడుగురు చనిపోయినట్లు ముంబై మీడియా ప్రకటించింది. దీంతోపాటు మరో 15 మందికి తీవ్ర గాయలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్‌ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని కమల నివాస భవనంలోని 18వ అంతస్తులో శనివారం ఉదయం 7 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంలో ఈ ఘటనప జరిగింది.

also read :-ప్రియాంకగాంధీ సంచలన నిర్ణయం

ఈ ప్రమాద ఘటనపై బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెంటనే స్పందించారు. సమాచారం అందుకున్న వెంటే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి పరుగులు తీశారు. కమల భవనం అపాª`టంª`మెంట్‌ వద్దకుఇంజన్లు, ఏడు వాటర్‌ జెట్టీల లతో చేరుకున్న సిబ్బంది వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. 15 మంది గాయపడ్డారని తెలిపారు. చాలా మంది శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారందరినీ సవిూపంలోని భాటియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరినవారిలో కొంతమందికి ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమైందని వైద్యులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చినా పెద్ద ఎత్తున పొగలు వస్తున్నట్లు ముంబై మేయర్‌ కిషోరీ పెడ్నేకర్‌ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పెడ్నెకర్‌ వివరించారు. ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. అపార్ట్‌మెంట్‌ వాసులు నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.