అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
(వేమనపల్లి-విజయం న్యూస్);-
వేమనపల్లి మండలం కేతనపల్లి గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన7.30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని తహసీల్దార్ రాజ్ కుమార్ మంగళవారం పట్టుకున్నారు. ఎమ్మార్వో తెలిపిన వివరాల ప్రకారం కేతన పల్లి గ్రామానికి చెందిన టకిరే బాపురావు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల నుంచి పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతుంటాడు.
also read;-అతివేగం ఒక చిన్నారి ప్రాణం చిదిమేసింది
ఈ విషయమై సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.పట్టుకున్న పిడిఎస్ బియ్యాన్ని రేషన్ డీలర్ కు అప్పగించి,నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ రాజ్ కుమార్ తెలిపారు.ఈ దాడిలో నాయబ్ తహసిల్దార్ సంతోష్,గిరిదావర్ ప్రశాంత్, విఆర్వోలు ప్రవీణ్, కరుణకర్ పాల్గొన్నారు.