అతివేగం ఒక చిన్నారి ప్రాణం చిదిమేసింది
—-శుభకార్యానికి వెళ్తూ తల్లి ఒడిలో కేరింతలు కొడుతూ వెళ్తున్న ఆ పసి హృదయం ఆగిపోయింది
—-అతివేగం ఆ చిన్నారి నూరేళ్ళ ఆయుష్హును మింగేసింది
—(యాదాద్రి భువనగిరి జిల్లా విజయం న్యూస్);-
రామన్నపేట మండలం లోని దుబ్బాక మార్గమధ్యలో టాటా ఇండిగో కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో సిరిపురం గ్రామానికి చెందిన అంబటి భావన రుషి తన భార్య గీత ఇద్దరు కూతుర్లు అయిన అమూల్య. కార్తీక తో కలిసి మోత్కూర్ లో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా రామన్నపేట దుబ్బాక మార్గమధ్యలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.
also read;-సేంద్రీయ సాగుకు తీసుకున్న చర్యలేంటీ?
ఈ ప్రమాదంలో భావనారుషి. చిన్న కూతురు కార్తిక రెండు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందింది పెద్ద కూతురు అమూల్య కి భావన రుషి కి స్వల్ప గాయాలు కాగ భార్య గీతకి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించి మెరుగైన వైద్యం కోసం అటు నుండి నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ తరలించారు…