Telugu News

కొత్త రాజ్యాంగం అవసరమనే కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా దీక్షలు.

= దేశ ప్రజలకు ,అంబేద్కర్ కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి...

0

కొత్త రాజ్యాంగం అవసరమనే కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా దీక్షలు.
== దేశ ప్రజలకు ,అంబేద్కర్ కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి…
== అరెస్ట్ లకు , నిర్బంధాలకు వెనుకాడం విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
భారత దేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికి రాదని కొత్త రాజ్యాంగం అవసరమని సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ తెలిపారు . ఇందుకు నిరసనగా మహాజన సోషలిస్టు పార్టీ , ఎమ్మార్పీఎస్ విభాగలతో పాటు అన్ని పార్టీలను , సంఘాలను కలుపుకొని బుధవారం నుంచి ఈ నెల 10 వరకు కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు . ఖమ్మం సిటీలోని ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ కు విచ్చేసిన మందకృష్ణ మాదిగ ఖమ్మంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు .

also read :-అసాంఘీక కార్యకలాపాలు చేస్తే సమాచారం ఇవ్వండి : ఏసీపీ బస్వారెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు , అంబేద్కర్ కు క్షమాపణ చెప్పేవరకు నిరసన కార్యక్రమాలు అగవన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రతి గ్రామంలో , విగ్రహం లేని చోట చిత్రపటాల కు పాలాభిషేకం చేయాలన్నారు . అదేవిధంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేపట్టాలని తెలిపారు . కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు నీరసన కార్యక్రమాలతో వెంటాడతామని హెచ్చరించారు . అరెస్టులకు, నిర్బంధాలకు వెనక్కి తగ్గేది లేదన్నారు . కేసీఆర్ అహంకార పూరిత మాటలు , నియంతృత్వ పోకడలకు నిదర్శనం అన్నారు . నిరసన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు . క్షమాపణ చెప్పే వరకు నిరసన తేదీలను పొడగిస్తాం తప్ప విరమించేది లేదని తెలిపారు . పాలకుల పోకడలు వల్లే రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తోందన్నారు . దళితుడైన అందెశ్రీ రాసిన జయహో తెలంగాణ అనే గీతం తెలంగాణ గీతంగా గుర్తింపు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు అమలుకు నోచుకోలేదన్నారు .

also read :-ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్ : జావిద్

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ వచ్చిందని గుర్తుంచుకోవాలని సూచించారు . కేసీఆర్ సోయి కోల్పోయి మాట్లాడుతున్నదని విమర్శించారు . కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు . పౌర స్వేచ్ఛ , వాక్ స్వాతంత్ర్యం కు మందు కేసీఆర్ కుట్రలు నిలబడటం లేదన్నారు . రాజ్యాంగంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు . కేసీఆర్ రాజ్యాంగ హక్కులను కాలారాస్తున్నారని విమర్శించారు . ఎమ్మార్పీఎస్ లో దీక్ష చేస్తున్న మమ్ముల్ని , కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని , 317 జీవో రద్దు చేయాలని బిజెపి ఎంపీ , భాజపా స్టేట్ అధ్యక్షులు బండి సంజయ్ ను , ప్రొఫెస్ర్ కోదండరామ్ లను కేసీఆర్ జైల్ కు పంపినప్పటికి న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు . ఈ సమావేశంలో లో లీడర్లు తూరిగంటి ఆంజయ్య , బచ్చలకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.