Telugu News

వనమా ఇంటికి భారీ పోలీస్ బందోబస్తు

** ఎలాంటీ అవాంచనీయ సంఘటన జరగకుండా పటిష్ట చర్యలు

0

వనమా ఇంటికి భారీ పోలీస్ బందోబస్తు

** ఎలాంటీ అవాంచనీయ సంఘటన జరగకుండా పటిష్ట చర్యలు

(భద్రాద్రికొత్తగూడెం-విజయం న్యూస్)

మానవ మృగంగా ప్రస్తుత పరిస్థితిల్లో పిలవబడుతున్న వనమా రాఘవ ఇంటిని పోలుసులు చుట్టుముట్టారు. నలుగురు ఆత్మహత్యలకు కారకుడైన కామాందుడు రాఘవ ను తక్ష అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పాత పాల్వంచలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం పాల్వంచ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రతిపక్ష పార్టీల నాయకులూ, కార్యకర్తలు, ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు..

also read :-ఏటూరునాగారం లో అక్రమ కలపను పట్టుకున్న పారెస్ట్ అధికారులు.

రాస్తారోకోలు చేస్తూ ట్రాఫిక్ ను నిలవరిస్తున్నారు. కాగా పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారూ. అయితే ఈ క్రమంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసులు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ నేపధ్యంలో ఎలాంటి చిన్న అవాంచనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకునేందుకు గాను వారు గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారూ. అయితే బందోబస్తు నిర్వహించడంపై కూడా ప్రజాసంఘాలు గుర్రుగా ఉన్నాయి. సంఘటన జరిగి ఐదురోజులు అవుతున్నప్పటికి రాఘవేంద్రరావు ను పట్టుకోకుండా, ఆయన ఇంటికి మాత్రం వందలాధిమంది పోలీసులను గస్తీ కాస్తున్నారని ఆరోపిస్తున్నారు.