Telugu News

మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాలి

జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్

0

మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాలి
జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్

(నల్లగొండ విజయంన్యూస్)-

కాలుష్యాన్నినియంత్రించాలంటే మొక్కలు నాటి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంనదని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి బీఎస్ జగ్జీవన్ కుమార్ అన్నారు. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. పర్యావరణానికి పాటుపడుతూ విరివిరిగా మొక్కలు నాటుతున్న పర్యవరణ కార్యకర్తలను అభినందించారు. అంతకుముదు జిల్లాకేంద్రంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి విద్యార్థినులతో కలసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విద్యార్థినులతో కలసి ప్రతిజ్ఞ చేయించారు. ఆయా కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ రవి, డెమెక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొజ్జ జానయ్య, డా.పుల్లారావు, ఏవో పద్మా, సెంట్రల్ నాజిర్ వినోద్ కుమార్, సినియర్ సూపరింటెండెంట్ శ్రీహరి, సూపరిండెంటెంట్ దీపికారాణి, కొండేటి కృష్ణ, ఎన్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా కోర్టులో మొక్కనాటుతున్న జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్

also read ;-_వందశాతం వ్యాక్సిన్‌ అందించాలి**