Telugu News

తెలంగాణ యూనివర్సిటీ.. టిఫిన్ లో కప్ప కళేబరం

తెలంగాణ యూనివర్సిటీ.. టిఫిన్ లో కప్ప కళేబరం

0

తెలంగాణ యూనివర్సిటీ.. టిఫిన్ లో కప్ప కళేబరం

(నిజామాబాద్ అర్బన్ – విజయం న్యూస్):-

డిచ్పల్లిలోని తెలంగాణ యునివర్సిటీ విద్యార్థినులు హాస్టల్లో అల్పాహారంలో కప్ప కళేబరం వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థినులకు అల్పాహారంగా వెజ్ బిర్యానీ వడ్డించారు. ఓ విద్యార్థిని తింటుండగా కప్ప కళేబరం రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. అప్పటికే చాలా మంది వెజ్ బిర్యానీ తిన్నట్లు విద్యార్థినులు తెలిపారు.

also read :-ఇండ్లను కూల్చవద్దని సెలైన్ పెట్టుకుని బాధితులు ధర్నా

అధికారుల పర్యవేక్షణ లోపంతోనే జరిగిందని, వీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆహారంలో కప్ప వచ్చిన విషయమై ఆరా తీశారు. ‘ఆహారం వండిన తర్వాత దుంకుడు కప్ప వచ్చి పాత్రలో పడి ఉంటుందని’ వంట మనిషి చెప్పడంతో రిజిస్ట్రార్ ఆగ్రహించారు. వంట చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వసతిగృహంలోని విద్యార్థినులందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు రిజిస్ట్రార్ స్పష్టత ఇచ్చారు.