టి ఎల్ పేటలో ఆరోగ్య శిబిరం కాళ్ళు కీళ్ళు నొప్పుల నివారణ చర్యలు
(ఏన్కూరు విజయం న్యూస్ ):-
మండల పరిధిలోని టి ఎల్ పేట గ్రామంలో కాళ్లు కీళ్ళనొప్పుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు.విజయం దినపత్రికలో ప్రచురితమైన ఊరంతా కాళ్లు కీళ్ల నొప్పులే అనే వార్త కు పంచాయితీ పాలకులు అధికారులు స్పందించారు.ఈ మేరకు గ్రామంలో గ్రామస్తులు తాగుతున్న మిషన్ భగీరథ నీళ్లను నర్సరీ ట్యాంకు నీళ్లను మినరల్ వాటర్ ను అధికారులు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు.
also read :-అధికారుల కనుసన్నల్లో అక్రమ ఇసుక మాఫియా
ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది స్థానిక ఏఎన్ఎంలు గ్రామంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి మందులను అందజేశారు.బుధవారం కూడా గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరం కొనసాగించనున్నారు.గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ భానోత్ వీరభద్రం,పంచాయతీ కార్యదర్శి శివ కోరారు.