నిత్యజీవనంలో యోగాతో ఆరోగ్యం: జడ్పీ సీఈవో
◆ అరవింద యోగా కేంద్రంలో అట్టహసంగా యోగా వేడుకలు
ఖమ్మం, జూన్ 21(విజయంన్యూస్):
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండటం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, అటువంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా..నిత్య జీవనంలో యోగతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని జడ్పీ సీఈవో ఇంజం అప్పారావు అన్నారు. ఉపాధ్యాయులు దండా లక్ష్మణరావు, బండి ఉష, నేతృత్వంలో నెలకొల్పిన “అరవింద ఉచిత యోగ శిక్షణ కేంద్రంలో” అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో ఇంజం అప్పారావు పాల్గొని ప్రసంగించారు. సంపూర్ణ ఆరోగ్యానికి శారీరక శ్రమ ఎంతో అవసరమని యోగా ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని అన్నారు. గత 17 సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో ఉచితంగా యోగ శిక్షణ ఇవ్వడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు శిక్షణ పొందుతున్న వారికి ప్రోత్సాహకంగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శీలంశెట్టి రమా వీరభద్రం, అరవింద యోగా ట్రస్ట్ నిర్వహకులు దండా లక్ష్మణరావు, బండి ఉష, ఆత్మజ్యోతి, ఒక్కపుడి శ్రీనివాసరావు, రేణుక, వేముల సీతీష్, రమేష్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి