కిందపడిన విద్యార్థిని..రక్షించిన కానిస్టెబుల్, ఆర్టీసీ సిబ్బంది
ఎగ్జామ్ వ్రాసి ఇంటికి వెళ్తుండగా...సొమ్మసిల్లి పడిపోయిన విధ్యార్దిని...
కిందపడిపోయిన విద్యార్థిని..రక్షించిన కానిస్టెబుల్, ఆర్టీసీ సిబ్బంది
== ఎగ్జామ్ వ్రాసి ఇంటికి వెళ్తుండగా…సొమ్మసిల్లి పడిపోయిన విధ్యార్దిని…
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
పరీక్షల కోసం చాలా కష్టపడి చదివిన విద్యార్థిని పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లిపోయే సమయంలో సొమ్మసిల్లి పడిపోయింది.. ఇది గమనించిన కానిస్టెబుల్ భరత్ ఆమెను రక్షించిన సంఘటన బుధవారం ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని( పేరు పెట్టోద్దని చెప్పిన ఆ విద్యార్థిని కోరికమేరకు) బుధవారం తమ కళాశాలలో పరీక్ష రాసింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు మధ్యాహ్న సమయంలో ఖమ్మం నూతన ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చింది. బస్టాండ్ లోకి వెళ్తుండగానే ఆ విద్యార్థిని వాంతులు చేసుకుని అట్లనే సొమ్మసిల్లి పడిపోయింది. అది గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టెబుల్ భరత్, ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న మహిళలు ఆ యువతిని మర్థన చేశారు. సహతప్పి పడిపోయిన ఆ యువతిని చేతులు, కాళ్లు రుద్ది సొయిలోకి వచ్చే విధంగా చేశారు. అక్కడే ఉన్న ప్రయాణికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడం తో ఆమెను ఆ అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోగా వెంటనే స్పందించి సేవలందించిన ఏఆర్ కానిస్టెబుల్ భరత్, ఆర్టీసీలో పనిచేసే మహిళలను స్థానికులు, ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు అభినందించారు. వారి సేవలను కొనియాడారు.