Telugu News

పోదం పావే బిడ్డో సర్కార్ కూసుమంచి దవఖానకు

కూసుమంచి దవఖానాలో మస్తుగైనయ్ కాన్పులు

0

పోదం పావే బిడ్డో సర్కార్ కూసుమంచి దవఖానకు
== కూసుమంచి దవఖానాలో మస్తుగైనయ్ కాన్పులు
== మూడు నెలల్లో 16, ఏడాదిలో 25 చేసిండ్రు వైద్యదేవుళ్లు
== అన్ని ఊళ్లలో మందికి చెబుతున్నరు మంచి వైద్యం గురించి వైద్యులు
== కూసుమంచి దవఖానోళ్లను మస్తుగా పొగుడుతున్నరు జనం
(కూసుమంచి-విజయంన్యూస్)
20ఏళ్ల ముందుగా సర్కార్ దవఖాన అంటే నేను రాను బిడ్డో సర్కార్ దవకానకు అంటూ పాట పాడుకున్నరు. ఇక కాన్పులంటే అమ్మో సర్కార్ దవఖానకా.. అక్కడకు బోతే చచ్చుడే అంటూ జనం మస్తుగా ప్రచారం చేస్తుండే. ఇక కాన్పులంటే 20ఏళ్ల కిందట సర్కార్ దవఖానాలకు వచ్చేటోళ్లు.. లేదంటే పల్లెల్లో, గూడేళ్లో మంత్రసానిలతో కాన్పులు యించేటోళ్లు.. మస్తుగా చల్లటి కాన్పులే వస్తుండేవి.. నూటికో, కోటికో ఒక్కటి ఆపరేషన్ చేసేటోళ్లు. కానీ ఐదేళ్ల తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది.. 15ఏళ్ల కిందట నుంచి మంత్రసాని కాన్పులను జనం మరిచిపోయిండ్రూ. సర్కార్ దవఖానాకు పోవుడు తగ్గింది..

also read;-ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి ఉద్యగం లోకి తీసుకొంటాము

అక్కడ కాన్పులే లేకుండా పోయినయి.. ఎక్కడో అక్కటి సర్కార్ దవకానలో కాన్పులు కనిపించేవి. కడుపు కోసి ఆపరేషన్ చేసే ప్రసవాలే మస్తుగా పెరిగినయ్. గడిచిన రెండేళ్ల వరకు గిట్లనే ఉండేది పరిస్థితి.. కడుపేదోళ్లే సర్కార్ దవకానకు పోయేటోళ్లు. కానీ ఉన్నోళ్లు, మద్యస్థంగా ఉన్నోళ్లు అందరు ప్రైవేట్ దవకానలకు పోయేటోళ్లు.. మస్తు పైసలు ఖర్చు పెట్టి ఆపరేషన్ల ద్వారా బిడ్డలను కనేటోళ్లు. గట్ల ఆపరేషన్ చేసిన ఆడోళ్లకు మస్తు పాణం సమస్యలు0డి.. కొంచం వయస్సు మీదపడ్డదంటే ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నరు. గిట్లగాదని తెలంగాణ సర్కార్ మంచి పని చేసింది. వైద్యశాఖపై పెద్దకన్ను పెట్టింది. సర్కార్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందించడం, డాక్టర్లను పెట్టడం, నర్సమ్మలను తీసుకోవడం, పాణం బాగు చేసే దవకానాలను తయారు చేసిండ్రూ. గట్లనే పెయి బాగు చేసే అన్ని రకాల పరీక్షలు చేసే మీషన్లను పెట్టిండ్రూ సర్కార్ దవకానలా. పెద్దపెద్దాసుప్రతిలోనే కాదు, చిన్నచిన్న తాలుకాలా పెట్టిన పిహెచ్ సీలో కూడా మంచిమంచి వసతులను కల్పించింది సర్కార్.

ప్రైవేట్ ఆసుపత్రిని ఎట్ట దిర్చిదిద్దిండ్రో అట్ట చేస్తున్నరు సర్కార్ సార్లూ. గీ విషయం తెలుసుకున్న కాడ నుంచి పేద ప్రజలే కాకుండా అన్ని కులాలమతాల ప్రజలు కూడా సర్కార్ దవకానాలకు వస్తు వైద్యం చేయించుకుంటున్నరు. ఇక కాన్పులైతే మస్తుగా చేయించుకుంటున్నరు. రాష్ట్రమంతటా సర్కార్ దవఖానాలో కాన్పుల సంఖ్య మస్తుగా పెరిగింది. అందులో కూడా నార్మల్ కాన్పులే ఎక్కువ అవుతున్నయంటా..? వైద్యశాఖోళ్లు చెప్పిండ్రూ. ఇక అయితే గట్లాంటి ప్లేసుల కూసుమంచి సర్కార్ దవకాన కూడా చేరింది.. అక్కడ కూడా మస్తుగా నార్మల్ కాన్పులు చేసిండ్రంటా.. ఒక సారి చూసోద్దం పార్రీ..

also read;-ఖమ్మం రూరల్ లో మరో మండలాన్ని ఇవ్వండి : కందాళ
కూసుమంచి మండల కేంద్రంలో సర్కార్ అసుపత్రి ఉంది. కిందట రెండేళ్ల కిత్రం ఏమో కానీ గిప్పుడు మాత్రం ఆ దవకాన రూపురేఖలే మారిపోయినయ్. గిది సర్కార్ దవకానేనా..? లేదంటే ప్రైవేట్ దవకానానా అన్నట్లుగా గట్లనే ఉండిపోతరు. అట్ట చేసిండ్రు మండల వైద్యం చేసే పెద్ద సార్ డాక్టర్ శ్రీనివాస్. ఆయన కరోనా సమయంలో కూసుమంచి పీహెచ్ సీ కి అచ్చినప్పటికి గా ఆసుపత్రి తీరే మార్చేసిండూ. మస్తుగా రంగులేపిచి, రూములను మంచిగా చేసి, ఆసుపత్రి చుట్టు మొక్కలేసి, వాటికి నీళ్లు పోసేటందుకు మోటరేసి చాలా బాగా తయారు చేసిండ్రు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది కూడా మస్తుగా పనిచేస్తుండి. సమయపాలన పాటిస్తుండ్రూ. రోగులను దూరం వాళ్లు అనుకోకుండా మా కుటుంబ సభ్యులు అన్నట్లుగా ట్రీట్ చేస్తున్నరు. తద్వారా రోగులకు, వైద్యసిబ్బందికి కొంత ప్రేమ కనిపించి తద్వారా రోగం మాయమ్యేయ్యే పరిస్థితి తెస్తున్నరు. ఆసుపత్రి తాకు పోతే గంటనిలబడాలనిపించే విధంగా తయారు చేసిండ్రు. రూమ్ లోకిపోతే ఇంకో గంట ఉంటే బాగుండును అన్నట్లుగా అందంగా మార్చేసిండ్రూ. వాళ్లతో పాటు దాతల సహాయం కూడా సర్కార్ దవఖానాకు మేలు జరిగిందనే చెప్పాలి.
== అసుపత్రిలో పెరుగుతున్న నార్మల్ డెలవరిస్
కూసుమంచి సర్కార్ దవఖానలో కాన్పులు మస్తుగా పెరుగుతున్నాయి. తెలంగాణ సర్కార్ ఇచ్చే కేసీఆర్ కిట్ ప్రభావమే, వైద్యుల సంకల్పమో.. జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలేమో కానీ గడిచిన మూడు నెలల కాడనుంచి మస్తుగా నార్మల్ గా కాన్పులు సంఖ్య పెరుగుతుంది. గడిచిన ఏడాది లో మొత్తం 25 నార్మల్ డెలవరీలు కాగా, మూడు నెలల్లోనే 16 మంది గర్భిణిలు కూసుమంచి సర్కార్ దవఖానాలో కాన్పుల కోసం వచ్చినట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపిండు. ఆసుపత్రిలో ప్రసవ గది నందు ఏసీ,బేబీ వర్మర్,ఓటీ లైట్, డాప్లర్, ఆక్సిజన్ కాంసంట్రేటర్,ఆటోక్లేవ్,కెల్లిస్ ట్రాలీ వంటి అధునాతన ఎక్విప్మెంట్ ఏర్పర్చుకొవడం వలన సర్కార్ ఆసుపత్రిపై జనంకు నమ్మకం పెరిగిందని డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారు. వైద్యసిబ్బంది కూడా ఉద్యోగ సమయమే కాకుండా చికటేళ్ల కాడా కాన్పుల కేసులు వస్తే వైధ్యాధికారి స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉండి ప్రసవాలు చేస్తున్నారు. అయితే కూసుమంచి మండలంలో పాటు పక్క జిల్లా సూర్యపేట జిల్లా నుంచి కూడా గర్భిణిలు కూసుమంచి సర్కార్ దవఖానాకు వచ్చి నార్మల్ ప్రసవాలకు మక్కువ చూపిస్తూ వైద్యసేవలను పొందుతున్నట్లు తెలిపారు. 2016 లో 3 నార్మల్ కాన్పులు, 2017 లో 5 కాన్పులు, 2018 లో 4,2019 లో 12, 2020 లో 15, 2021 ఏప్రిల్ నుండి ఇప్పడివరకు 25 డెలివరీలు చేసినట్లు తెలిపారు.

== ఆసుపత్రికి వస్తే కుటుంబ సభ్యుల వల్లే
కూసుమంచి ఆసుపత్రికి గర్భిణీలు వస్తే వారిని అక్కడ సిబ్బంది మస్తు ప్రేమగా చూస్తున్నరని గర్భిణిలు చెబుతున్నరు. ఈ ఆసుపత్రి నందు మహిళ గర్భం దాల్చిన రోజు నుండి నెలలు నిండే వరకు అన్ని రకాల మూత్ర పరీక్షలు రక్త పరీక్షలు చేయడం, ప్రతి సోమవారం క్లినిక్ లో గర్భిణీ స్త్రీలను ప్రత్యేకంగా పరీక్షలు చేయడం, ప్రతి గురువారం గ్రీన్ ఛానల్ లో భాగంగా 102 వాహనం లో స్కానింగ్ కొరకు స్పెషలిస్ట్ సేవల కొరకు ఖమ్మం పంపించడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు. అలాగే వారానికి 3 రోజులు గైనకాలజిస్ట్ టెలి కన్సల్టేషన్ ద్వారా అందుబాటులో ఉంటారని మహిళా వైద్యురాలు డా, ఇవాన్జలిన్ తెలియచేశారు. డెలివరీ అయిన వెంటనే తల్లి పాలు అందించి జీరో డోసు టీకాలు వేసి ఆసుపత్రిలో ఉండే 3 రోజులు బోజనం పెట్టి డిశ్చార్జ్ అవ్వగానే 102 వాహనం నందు తల్లి బిడ్డని ఇంటి వద్దకు వెళ్లి దింపడం జరుగుతుందని సీనియర్ స్టాఫ్ నర్స్ మమత గారు తెలియ చేశారు. గ్రామంలో ఆశావర్కర్, ఏఎన్ఎంలు, సూపరవైజర్లు గర్భిణీ స్త్రీ ఇంటింటికి వెళ్లి నార్మల్ ప్రసవం వలన జరిగే ఉపయోగాలు అలాగే ప్రభుత్వం అందించే సర్కార్ కిట్ గురించి తెలియచేసి పీహెచ్ సీ నందు డెలివరీ అయ్యేలా చేతన్య కార్యక్రమాలు చేస్తున్నారు.

also read;-పార్టీ ద్రోహి తుమ్మల : బెల్లం వేణు

దీంతో కూసుమంచి పీహెచ్ సీ, వైద్యులు, సిబ్బందిని ప్రజలు ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. గత కొద్ది నెలల క్రితం కూసుమంచి మండల సర్వసభ్యసమావేశంలో మండలంలోని ప్రజాప్రతినిధులందరు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ను అభినందస్తూ సన్మానం చేసిన పరిస్థితి కూడా ఉంది. అలా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
== తల్లిబిడ్డకు క్షేమం నార్మల్ డెలవరీ : డాక్టర్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి, కూసుమంచి
కూసుమంచి పీహెచ్ సీ చాలా మెరుగైంది. దాతల సహాయం, ప్రభుత్వ సహాయం, వైద్యసిబ్బంది సహాయంతో కూసుమంచి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి రోగులు చాలా ఎక్కువగా వస్తున్నారు. మాపై ప్రజలకు నమ్మకం కల్గింది. మంచి వైద్యం చేస్తామనే నమ్మకం కల్గింది. అలాగే ప్రభుత్వాసుత్రిలో డెలివరీ కోసం చాలా ఎక్కువ మంది గర్భిణిలు ఆసుపత్రికి వస్తున్నారు. వారందరికి నార్మల్ డెలవరీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువగా నార్మల్ డెలవరీ అవుతున్నాయి. దాని వల్ల తల్లిబిడ్డలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.