Telugu News

కేవిఆర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

విజయవంతంగా సర్జరీ చేసిన డాక్టర్ కోటా రాంబాబు

0

కేవిఆర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

== విజయవంతంగా సర్జరీ చేసిన డాక్టర్ కోటా రాంబాబు

(మధిర/ఖమ్మం-విజయంన్యూస్)

కే వి ఆర్ హాస్పిటల్ నందు చాలా అరుదైన, కష్టసాధ్యమైన లాపరోస్కోపి ఆపరేషన్ డాక్టర్ కోటా రాంబాబు, విజయవంతం గా నిర్వహించారు. మధిర కే వి ఆర్ హాస్పిటల్ నందు లాపరోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లోని సుమారు 150 గ్రాములు వున్న ఒక పెద్ద రాయిని లాపరోస్కోపీ విధానం ద్వారా తొలగించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ కోట రాంబాబు తెలియజేసారు.

also read :-సేంద్రీయ సాగుకు తీసుకున్న చ‌ర్య‌లేంటీ?

ఈ సందర్భంగా డా.రాంబాబు మాట్లాడుతూ 70 సం వయసువున్న ఒక వ్యక్తి చాలా కాలం నుండి కడుపులో నొప్పితో బాధపడుతూ నిన్న కే వి ఆర్ హాస్పిటల్ కు రాగా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి చూడగా గాల్ బ్లాడర్ నందు రాయి వున్నట్లు గా తేలింది. ఆపరేషన్ చేసి ఆ రాయి తొలగించాలి అని సూచించి ఈరోజు ఉదయం ఆపరేషన్ మొదలుపెట్టి చేస్తుండగా అతనికి అప్పటికే ఆ రాయి గాల్ బ్లాడర్ పగిలిపోయి బయటకి వచ్చి ఆ రాయి ఉన్న చోటు అంతా కూడా చీము పట్టి పేగులు అన్ని కూడా అతుక్కుపోయి వుండటాన్ని గుర్తించి దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి ఆ రాయిని, గాల్ బ్లాడర్ ను తొలగించి ఆ చీము వున్న చోటు అంతా శుభ్రం చేసి, ఆ చీమును కూడా తీసేసి అతనిని సురక్షితంగా కాపడినము అని అన్నారు.

also read :-అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయి అని వాటిని లాపరోస్కోపి ద్వారా ఆపరేషన్ చేసి తొలగించుకోవచ్చు అని అన్నారు.. అంతే కాకుండా ఇంతకముందు కూడా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ కు కూడా గాల్ బ్లాడర్ నందు ఉన్న 33 రాళ్ళను తొలగించాము అని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేసి అతనిని సురక్షితంగా కాపాడిన డా.రాంబాబు గారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు….