Telugu News

పద్మావతి హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స

0

పద్మావతి హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స

 

—-లివర్ సిర్రోసిస్,అనాసార్క, అనే వ్యాధితో బాధపడుతున్న రోగికి కడుపులో పెరుగుతున్న కణితి ఆపరేషన్

 

—-డాక్టర్ అంజన్ కుమార్,డాక్టర్ శిల్ప లను అభినందిస్తున్న రోగి బంధువులు

(మహబూబాబాద్- విజయం న్యూస్);-

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మావతి హాస్పిటల్ లో ప్రముఖ గైనకాలాగిస్ట్ డాక్టర్ గంటా శిల్పా ఆధ్వర్యంలో డాక్టర్ నన్నపనేని అంజన్ కుమార్,జనరల్ సర్జన్, అనేస్తేషియా డాక్టర్ చింత రమేష్,రోగికి అరుదైన ఆపరేషన్ చేసి రికార్డ్ సృష్టించారు. దామరవంచ గ్రామానికి చెందిన పగిడిపాల సమ్మక్క,గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఖమ్మం,మరియూ వరంగల్ లాంటి నగరాల్లో పలువురి డాక్టర్ లకు చూపించగా ఆమె కడుపులో గర్భాశయనికి కణితి అయ్యిందని తెలుపగ ఆమెకు శరీరంలో రక్త శాతం తక్కువగా ఉన్నదని అంతే కాకుండా లివర్ సమస్యతో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రోగికి ఆపరేషన్ చేయటం సాధ్యం కాదని అన్నారు.

also read :-మంత్రి పువ్వాడ పై విమర్శలు మానుకోకపోతే తగిన బుద్ది చెబుతాం..

వారు దిక్కు తోచని స్థితిలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లోని పద్మావతి హాస్పిటల్ లోని డాక్టర్ గంటా శిల్ప,డాక్టర్ అంజన్ కుమార్ లను సంప్రదించామని తెలిపారు.వారు రోగిని పది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి రోగికి ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా పద్మావతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గంటా శిల్పా, మరియూ డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ రోగిని పరీక్షించిన అనంతరం ఆమెకు 2 గ్రాముల రక్తం మాత్రమే ఉన్నదని అంతే కాకుండా లివర్ సిర్రోసిస్,అనాసార్క, అనే వ్యాధితో భాదపడుతున్నదని తెలిపారు.రోగికి వారి బంధువులకు రిస్క్ చెప్పటంతో వారు అంగీకరించిన అనంతరం ఆపరేషన్ నిర్వహించి సుమారు రెండున్నర కేజీల కణితి తో పాటు గర్భాశయాన్ని తొలగించామని తెలిపారు.ప్రస్తుతానికి రోగి పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆక్సిజన్ మెయింటెన్ చేస్తున్నామని 48 గంటలు గడించిన అనంతరం రోగి కొలుకుంటుందని ప్రస్తుతానికి రోగి పరిస్థితి ఏమి చెప్పలేమని అన్నారు.ఈ సందర్భంగా పేషేంట్ బంధువులు డాక్టర్లను అభినందించారు.