డాక్టరేట్ పట్టా పొందిన సిస్టర్ విజయ ప్రభావతి…
(నాగార్జునసాగర్ – విజయం న్యూస్);-
నాగార్జునసాగర్ లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వర్తిస్తున్న సిస్టర్ విజయ ప్రభావతి కరోనా సమయంలో సమయం వృధా చేయకుండా తమిళనాడుకు చెందిన భారతీయార్ యూనివర్సిటీలో దూర విద్యా విభాగంలో జంతు శాస్త్ర విభాగం నుండి “మానవులకు కలిగే వ్యాధులు వాటి నివారణ ఉపాయాలు మరియు బాలలపై హెచ్ఐవి ఎయిడ్స్ ప్రభావం “అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని పరిశోధన చేసి పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీని పొందారు.
also read ;-సామాజిక చైతన్యం కోసం మహనీయుల జీవిత చరిత్ర చదవడమే మార్గం .
సిస్టర్ విజయ ప్రభావతి పి హెచ్ డి డిగ్రీ పొంది డాక్టరేట్ సాధించడంపై జె ఎం జె సొసైటీ వారు , పాఠశాల నిర్వాహకులు మరియు ఉపాధ్యాయ అధ్యాపక బృందం ఆమెను అభినందించారు. క్రిస్టియన్ సిస్టర్ గా జీవితాన్ని అంకితం చేసి జీవితం ప్రారంభించిన సిస్టర్ విజయ ప్రభావతి ఆధ్యాత్మిక ,బోధన, విద్య విభాగాలలో ఎనలేని కృషి చేస్తున్న సిస్టర్ విజయ ప్రభావతి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు .