Telugu News

భక్తులు నూతన ఉత్సాహం తో రామప్ప లో సందడి

** రామప్పను అధిక సంఖ్యలో సందర్శించుకుంటున్న భక్తులు

0

భక్తులు నూతన ఉత్సాహం తో రామప్ప లో సందడి

** రామప్పను అధిక సంఖ్యలో సందర్శించుకుంటున్న భక్తులు

(వెంకటాపూర్ (రామప్ప)-విజయం న్యూస్)

వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం లోని ప్రసిద్ధి రామప్ప ను సందర్శించుకున్న భక్తులు జనవరి1 నూతన సంవత్సరం ప్రారంభంతో అధిక సంఖ్యలో భక్తులు రామప్ప రామలింగేశ్వర
స్వామి దర్శనం తీసుకోవడం జరిగింది.యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత అధిక సంఖ్యలో భక్తులు రామప్ప రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారని అధికారులు తెలుపుతున్నారు.విశాలమైన ప్రదేశంలో రామప్ప దేవస్థానం ఉంటుందని భక్తులు తెలియజేశారు.శిల్ప నైపుణ్యం కలిగి,నంది నీ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుందని మనసుకు హత్తుకునేలాగా ఉంటుందని భక్తులు తెలియజేశారు.కుటుంబ సభ్యులు తో కలిసి రామప్ప ను సందర్శించాం అని చాలా మంది భక్తులు తెలియజేశారు.

శనివారం,ఆదివారం రోజులల్లో రామప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.భక్తులు ప్రత్యేక పూజలు,అర్చనలు,అభిషేకాలు చేశారు.రామప్ప సరస్సు అందాలను వీక్షించి మధుర అనుభూతి నీ పొందారు.రామప్ప దేవాలయం చరిత్ర గురించి శిల్ప నైపుణ్యం గురించి రామప్ప గైడ్ లు గోరంట్ల విజయ్ కుమార్ మరియు వెంకటేష్ లు భక్తులకు వివరించడం జరిగింది.అయితే రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన అప్పటి నుంచి ఆలయ అభివృద్ధికి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి.ఇప్పటికే రాష్ట్ర,జిల్లా స్థాయి అభివృద్ధి కమిటీలు ఏర్పాటయ్యాయి. హైకోర్టు,సుప్రీం కోర్టు సైతం ప్రత్యేక దృష్టి సారించింది.

ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో భక్తుల రద్దీ నేపథ్యం లో జంగాలపల్లి నుంచి పాలంపేట వరకు గల రోడ్డున నాలుగు వరుసల గా విస్తరించెందుకు ఏర్పాట్లు చేస్తున్నారనీ అధికారులు తెలిపారు.మేడారం జాతర పూర్తి అయిన తర్వాత రోడ్డు పనులు ప్రారంభం అవుతాయనీ జిల్లా అధికారులు తెలిపారు.గతం లో రామప్ప ను 500 మంది భక్తులు దర్శించుకోవడం జరిగితే రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత 1500 లకు పైబడి అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.ఇంకా ఎన్నో రకాల అభివృధి కి పాటుపడలని అధికారులను భక్తులు కోరారు.ఆలయ పూజారులు ఉమా మహేశ్వరలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.భక్తులు నూతన ఉత్సాహంతో రామప్ప లో సందడి చేశారు.

ALSO READ :- నూతన సంవత్సర వేడుక విషాదం కావద్దు.. కూసుమంచి సిఐ సతీష్ కుమార్.