★ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
★ అంబేద్కర్ జయంతి సందర్భంగా
మంత్రి అజయ్ నివాళులు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ డా. బీఆర్ అంబేద్కర్ కలలను నిజం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మంత్రి అజయ్ నివాళులర్పించారు.సీఎం కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక విధానాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయని ఆయన చూపిన దారిలోనే తెలంగాణ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయనడంలో సందేహం లేదన్నారు. దళిత, గిరిజనుల కోసం ప్రత్యేక ఉప ప్రణాళికల అమలు, ‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్’ ద్వారా ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఖమ్మం జెడ్పీ సెంటర్ లో 14 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రదేశాన్ని అంబేద్కర్ సెంటర్గా నామకరణం చేశామని గుర్తు చేశారు.
also read :-ఇద్దరు మావోయిస్టులు అరెస్టు
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పది లక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంటే నేడు సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో రిజర్వేషన్ తెచ్చారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.
నాటి సమాజంలో అణచివేత, కులవివక్ష, చిన్నచూపునకు గురైన అంబేద్కర్ ప్రపంచ దేశాలకు వెళ్లి ఎవరూ సాధించలేని ఉన్నత చదువులు చదివి భారతదేశ రాజ్యాంగాన్ని రచించారని అన్ని వర్గాల ప్రశంసలు పొందారన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
also read :-పొంగులేటి మరో సంచలన ప్రకటన
ఆకలి, పేదరికం అసమానతల్లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు ఏండ్ల తరబడి సమాజంలో వివక్ష, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు సీఎం కేసీఆర్ నడుంబిగించారని అంబేద్కర్ దార్శనికత మూలంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.