Telugu News

ఛత్తీస్‌గఢ్ ప్ర‌భుత్వానికి బ్యాడ్ న్యూస్‌

డిప్యూటీ స్పీకర్‌ మనోజ్‌ సింగ్‌ మాండవి కన్నుమూత

0

ఛత్తీస్‌గఢ్ ప్ర‌భుత్వానికి బ్యాడ్ న్యూస్‌
== డిప్యూటీ స్పీకర్‌ మనోజ్‌ సింగ్‌ మాండవి కన్నుమూత
== గుండెపోటుతో అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాండ‌వి
(ఛ‌త్తీస్ గ‌ఢ్ -విజ‌యంన్యూస్)

ఛత్తీస్‌గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పొద్దుపొద్దుగ‌ల‌ బ్యాడ్ న్యూస్ వార్త ఇది. ఛ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్ర‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మనోజ్‌ సింగ్‌ మాండవి(58) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్‌లో నివాసం ఉంటుండ‌గా, శనివారం రాత్రి అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన్ని వెంటనే చరమలోని ఆసుపత్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో త‌క్ష‌ణ‌మే ధామ్‌తరి పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న మాండ‌వి క‌న్నుమూశారు.. ప్రస్తుతం ఆయన కంకేర్‌ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాండవి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2000- 2003 వరకు అజిత్‌జోగి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. మాండవి మృతికి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి బూపేస్‌ బాగెల్‌, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు.

allso read- నేటి నుంచి ప్రపంచకప్ టీ20 క్రికెట్ ఆరంభం