Telugu News

ఘనంగా 2566 వ బుద్ధ జయంతి ఉత్సవాలు…

బుద్ధవనం లో 2566 విద్యుత్ దీప కాంతులు....

0

ఘనంగా 2566 వ బుద్ధ జయంతి ఉత్సవాలు…

—-బుద్ధవనం లో 2566 విద్యుత్ దీప కాంతులు….

—-బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య

(శ్యామ్, నాగార్జునసాగర్ ప్రతినిధి – విజయం న్యూస్);-
తెలంగాణ ప్రభుత్వము నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బౌద్ధ వారసత్వ పర్యాటక ఆకర్షణ బుద్ధవనం ప్రాజెక్టు లో బుద్ధుని 2566 జయంతి ఉత్సవాల సందర్భంగా2566 విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానం అవుతుందని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించిన టువంటి ప్రాజెక్ట్ లో ఎంట్రన్స్ ప్లాజా ,బుద్ధ చరిత వన o ,ధ్యాన వనం ,జాతక వనం, మహా స్తూపం రంగు రంగుల విద్యుత్ కాంతులతో కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా మొదటిసారిగా భారీ ఎత్తున విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టినట్లు తెలిపారు. 2566 వ బుద్ధ జయంతి రోజున 2566 విద్యుద్దీపాలతో బుద్ధ వనములో బుద్ధ జయంతిని జరుపుకోవడం ఎంతో అరుదైన విషయమని అన్నారు.

also read :-పరిశుభ్రతే..మనిషికి ప్రధాన రక్షణ..

నాగార్జునసాగర్ చుట్టుపక్కల సమీప ప్రాంతాలు ,హైదరాబాద్, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో బౌద్ధ అభిమానులు, ప్రజలు హాజరై బుద్ధ వనములో జరిగే బుద్ధ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధవనం ప్రాజెక్టులో నిర్వహించి బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు లో సాయంత్రం ఏడు గంటలకు హర్యానా ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉండ్రు రాజశేఖర్ ఐఏఎస్ “సమకాలీన సమాజంకి బౌద్ధం” అనే అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి ,ఆచార్య సంతోష్ రావత్ తదితరులు పాల్గొంటారని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు.