Telugu News

భారతీయ ప్యాకేజింగ్‌ను విప్లవాత్మీకరించనున్న సీజ్‌వెర్క్‌

0

భారతీయ ప్యాకేజింగ్‌ను విప్లవాత్మీకరించనున్న సీజ్‌వెర్క్‌ ;

వెగా మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ఇంక్స్‌ ఆవిష్కరణ

(విజయం న్యూస్):-

• మే01,2022 నుంచి సీజ్‌వెర్క్‌ యొక్క భివాండీ ప్లాంట్‌ 100% మినరల్‌ ఆయిల్‌ రహితంగా మారనుంది ; భారతదేశంలో ఈ తరహాలో మారిన మొట్టమొదటి కంపెనీగా నిలువనుంది

• సానుకూల సర్క్యులర్‌ ఎకనమీ సంస్ధగా మారాలనే సీజ్‌వెర్క్‌ నిబద్ధతకనుగుణంగా ఇది జరిగింది

ఇండియా, హైదరాబాద్, ఫిబ్రవరి 2022 : ప్యాకేజింగ్‌ అవసరాలతో పాటుగా లేబుల్స్‌ కోసం ప్రింటింగ్‌ ఇంక్‌లు మరియు కోటింగ్స్‌ను అందించేటటువంటి అంతర్జాతీయ సంస్థలలో ఒకటి కావడంతో పాటుగా జర్మనీలో ప్రధాన కార్యాలయం కలిగిన సీజ్‌వెర్క్‌, భారతదేశపు మార్కెట్‌ కోసం తమ మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ఇంక్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. రసాయనాలతో కూడిన భారీ సమూహం మినరల్‌ ఆయిల్స్‌. వీటికున్న విషపూరిత రసాయన లక్షణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వీటి పట్ల వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే చాలా వరకూ అధ్యయనాలు ఈ మినరల్‌ ఆయిల్స్‌ ఆహారంలో కలిసి పోతున్నాయని కూడా నిర్థారించాయి.

also read;-ఘోర ప్రమాదం ….

నిర్ధిష్టమైన మినరల్‌ ఆయిల్‌ హైడ్రోకార్బన్‌లు (MOHs) తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కొన్ని శాచురేటెడ్‌ మినరల్‌ ఆయిల్స్‌ (MOSH) మానవ కణజాలంలో పేరుకుపోవచ్చు, అలాగే కొన్ని అరోమాటిక్‌ మినరల్‌ఆయిల్స్‌ (MOAH) వల్ల క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయి.

మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ఇంక్‌ను విడుదల చేస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా వెగా సిరీస్‌ శీర్షికన వర్ట్యువల్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజ్‌వెర్క్‌ తాము తమ భారతదేశంలో 100% ఆహార భద్రతా కార్యకలాపాలను చేరుకున్నామని వెల్లడించింది.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలోనే సీజ్‌వెర్క్‌ యొక్క భివాండీ తయారీ యూనిట్‌ను పూర్తి శ్రేణిలో మినరల్‌ ఆయిల్‌ రహిత ప్లాంట్‌గా మార్చినట్లు వెల్లడించింది.

మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ఇంక్‌ శ్రేణి వెగా ఆవిష్కరణ గురించి సీజ్‌వెర్క్‌ ఇండియా సబ్‌కాంటినెంట్‌ సీఈవో రామ కృష్ణ కారాంత్‌ మాట్లాడుతూ ‘‘గత కొద్ది సంవత్సరాలుగా ఆహార వస్తువుల ప్యాకేజింగ్‌లో మినరల్‌ ఆయిల్‌ హైడ్రోకార్బన్స్‌ (MOH), శాచురేటెడ్‌ మినరల్‌ ఆయిల్స్‌ (MOSH) వల్ల కలిగే ప్రమాదాలను గురించి పలు సైంటిఫిక్‌ జర్నల్స్‌ విశ్లేషణాత్మక అధ్యయనాలను ప్రచురించాయి. వినియోగారుల భద్రత మరియు వృత్తి పరమైన భద్రతకు సంబంధించి ఇవి కలిగించే దుష్పరిణామాలు ఎన్నో రెట్లు తీవ్రంగా ఉన్నాయి.

also read :-****పిలిస్తే పలుకుతా..! తోచిన సాయం చేస్తా..: పొంగులేటి

సీజ్‌వెర్క్‌ వద్ద తాము తుది వినియోగదారులు మరియు పర్యావరణ భద్రత మెరుగుపరచడానికి ప్రత్యేకంగా దృష్టి సారించి ఎలాంటి అంశాలకూ లొంగని భద్రతా సంస్కృతిని పెంపొందించుకుంటున్నాము. సేఫ్‌ ఇంక్స్‌లో మార్కెట్‌ అగ్రగామిగా మరియు భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చే సంస్థగా చట్టపరంగా నియంత్రణ సంస్ధలు నిషేదం విధించడానికి ముందుగానే మేము వేగంగా స్పందించడంతో పాటుగా విష రసాయనాలతో కూడిన పదార్థాల వినియోగాన్ని ఆపివేశాము. సీజ్‌వెర్క్‌ ఇండియా ఇకపై భారతదేశంలో తమ బ్లెండింగ్‌ కేంద్రాల ద్వారా మినరల్‌ ఆయిల్స్‌ రహిత ఇంక్‌లను మాత్రమే సరఫరా చేయనుంది’’అని అన్నారు.

సీజ్‌వెర్క్‌ ఆసియా అధ్యక్షులు అశీష్‌ ప్రధాన్‌ ఈ నూతన శ్రేణి మినరల్‌ ఆయిల్‌ రహిత ఇంక్‌లను ఆవిష్కరించారు. ఈ వైవిధ్యమైన ఇంక్‌లలో వెగా ప్రోరిచ్‌, వెగా ఇంప్రెషన్‌, వెగా నేచర్‌ ఎల్‌టీ, వెగా స్ర్పింట్‌, వెగా వైబ్రంట్‌+ మరియు వెగా ప్రైమ్‌ ఇంక్‌ లైన్స్‌ ఉంటాయి. ఇవన్నీ తమ సంబంధిత ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.

సీజ్‌వెర్క్‌ ఇండియా షీట్‌ఫెడ్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌, అశీష్‌ ముఖర్జీ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ సీజ్‌వెర్క్‌ యొక్క కీలక సిద్ధాంతాలైనటువంటి ఆవిష్కరణ, భద్రత మరియు అత్యున్నత ఉత్పత్తులు, సేవలను అందించే సామర్థ్యంకు అనుగుణంగా వెగా శ్రేణి ఉంటుంది. మహోన్నతమైన కలర్‌ స్ట్రెంగ్త్‌, డాట్‌ పార్ప్‌నెస్‌తో అద్భుతమైన ప్రింటింగ్‌ నాణ్యత, ప్రకాశవంతమైన రీతిలో కలర్‌ షేర్‌, హైగ్లోస్‌, అసాధారణ డ్రైయింగ్‌ లక్షణాలు వంటివన్నీ వినియోగదారుల అంచనాలను అధిగమించే రీతిలో ఉంటాయి. వెగాతో మేము మా సరఫరా గొలుసు భాగస్వాములతో పాటు తుది వినియోగదారుల భద్రతను నిర్థారించే ప్రయాణం ప్రారంభించాము’’అని అన్నారు.

also read :-ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు…..

ఈ భారీ ఆవిష్కరణకు అదనపు ఆకర్షణగా సుప్రసిద్ధ క్రికెట్‌ కామెంటేటర్‌ మరియు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ హర్ష భోగ్లే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి మాట్లాడారు.భారతదేశంలో అత్యుత్తమ నాణ్యత మరియు భద్రతా నియంత్రణ సంస్థలు – బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) మరియు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)లు ప్యాకేజింగ్‌ భద్రత ప్రాముఖ్యతను ‘ఆహార భద్రత మరియు ప్రామాణిక (ప్యాకేజింగ్‌) నియంత్రణలు, 2018 మరియు దాని సవరణలు ’ద్వారా వెల్లడించాయి. చట్టపరంగా ఎలాంటి నిబంధనలనూ అమలులోకి తీసుకురాక మునుపే సీజ్‌వెర్క్‌, ఉత్పత్తి భద్రత పట్ల తమ రాజీలేని నిబద్ధతతో విష రహిత ఇంక్‌లకు ప్రచారం చేస్తుంది.

ప్యాకేజింగ్‌ ఉత్పత్తులలో పారదర్శకత, సురక్షిత పదార్థాల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు స్పందనగా సీజ్‌వెర్క్‌ యొక్క వెగాను ఆవిష్కరించారు. ఈ ఇంక్‌లను మూడు ఎస్‌లు – సేఫ్టీ (భద్రత), సస్టెయినబిలిటీ (పర్యావరణ అనుకూలత), వినియోగదారుల శాటిస్‌ఫాక్షన్‌ (సంతృప్తి) అంశాలను మనసులో ఉంచుకుని రూపొందించారు. తమ భాగస్వాములతో కలిసి సురక్షిత ఇంక్‌లు అందించడంతో పాటుగా ప్రమాదకరమైన ద్రావకాలైన మినరల్‌ ఆయిల్స్‌, టోల్యూన్‌ను పూర్తిగా విస్మరించడం మరియు ఆ దిశగా తమ ప్రయత్నాలను వేగవంతంగా కొనసాగిస్తాని సీజ్‌వెర్క్‌ ప్రతిజ్ఞ చేస్తుంది.