Telugu News

నాగార్జున కొండను సందర్శించిన మైసూర్ బౌద్ధ గురువుల బృందం

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ లోని నాగార్జున కొండను ఆదివారం మైసూరుకు చెందిన బౌద్ధ గురువుల బృందం సందర్శించారు

0

నాగార్జున కొండను సందర్శించిన మైసూర్ బౌద్ధ గురువుల బృందం

( నాగార్జునసాగర్ ప్రతినిధి – విజయం న్యూస్)
అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ లోని నాగార్జున కొండను ఆదివారం మైసూరుకు చెందిన బౌద్ధ గురువుల బృందం సందర్శించారు. బుద్ధవనం ప్రాజెక్టు ఆవిష్కరణ లో భాగంగా నాగార్జున సాగర్ కు విచ్చేసిన వీరు ఆదివారం నాడు మైసూరు బైల కుప్పె కు చెందిన” షేరే బౌద్ధారామం “బుద్ధిష్ట్ మాంక్ గీసే నగ్వాంగ్ జంగ్నే ఆధ్వర్యంలో బౌద్ధ భిక్షువుల బృందం నాగార్జున కొండ ను సందర్శించారు.

also read :-ఇసుక లారీలను ఆపిన గ్రామస్తులు

also read :- హమాలీల పై తప్పుడు ప్రచారాన్ని ఖండించండి. అఖిలపక్ష కార్మిక సంఘాలు .

దీనిలో భాగంగా నాగార్జునకొండ మ్యూజియం, అక్కడ నిర్మించిన పునర్నిర్మాణ కట్టడాలను వీక్షించారు. మూడో శతాబ్దం నాటి గౌతమ బుద్ధుని యొక్క పాల రాతి శిల్పాలను చూసి మధురానుభూతి లోనయ్యారు. ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచిన గౌతమ బుద్ధుని ధాతువులను కళ్ళారా చూసి తలపై పెట్టుకుని తమ జీవితం ధన్యమైంది అన్నారు. వీరితో పాటు బుద్ధవనం ప్రాజెక్ట్ డిజైన్ ఇంచార్జ్ శ్యామ్ సుందర్ ,స్థానిక గైడు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.