Telugu News

పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థలో విజ్ఞాన భాండాగారం

నిర్లక్ష్యపు.. చెదలు...తో పుస్తకాలన్ని ధ్వంసం

0

పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థలో విజ్ఞాన భాండాగారం

—నిర్లక్ష్యపు.. చెదలు…తో పుస్తకాలన్ని ధ్వంసం

—-విద్యార్థులకు పాఠకులకు అక్కరకు రాని గ్రంథాలయం

—-నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి

—బీజేపీ మండల అధ్యక్షులు బోయిని యాకన్న ముదిరాజ్

(మహబూబాబాద్- విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని గ్రంథాలయం లో సమస్యలు తాండవిస్తున్నాయి.గ్రంధాలయ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది భవనాల్లో నడుస్తుండగా.. సొంత భవనాలు మరమ్మతులకు గురయ్యాయని. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోయిని యాకన్న ముదిరాజ్ అన్నారు. గ్రంథాలయం లో ఉన్న పుస్తకాలకు బూజు పడుతున్నాయని.మండలంలోని గ్రంథాలయ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

also read :-నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.

గ్రంథాలయ వారోత్సవాల పేరుతో ఏటా వారంపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత వాటి అభివృద్ధి ఊసే మరిచిపోతున్నారని. ప్రభుత్వాలు ఎన్ని మారినా గ్రంథాలయాల పరిస్థితి మాత్రం మారడం లేదని ఆయన అన్నారు.నాటి కవులు కళాకారులు అయినటువంటి దాశరధి సోదరులు జన్మించిన చిన్న గుడూరు గడ్డ పై గ్రంధాలయాన్ని చదలు పట్టిస్తున్న పాలకుల వైఖరి ఏమిటో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. ఉద్యోగ సాధనలో ఎందరో నిరుద్యోగులకు దిక్సూచిలా ఉండాల్సిన ప్రభుత్వ గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని అన్నారు.ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి విజ్ఞాన భాండగారం అయిన దాశరధి గ్రంధాలయం పునర్నిర్మించాలని మండల భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.