పంజాబ్‌లో స్పష్టమైన ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ
(చండీఘడ్-విజయంన్యూస్):-
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ.. పార్టీ
పంజాబ్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలను చీపురు పార్టీ ఊడ్చిపడేసింది. ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అధిక్యం లో దూసుకుపోతోంది.
also read :-బిజెపి ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై రేపు తీర్పు
ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటూతూ.. ఏకంగా 100 స్థానాల అధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మరో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు సంకేతాలు పంపింది. ఈ క్రమంలోనే ఆప్ పార్టీ చీఫ్ ఢల్లీి సీఎం కేజీవ్రాల్ ఢల్లీిలోని హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఢల్లీి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కలిసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఢల్లీి ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్ పాలనా విధానం నేడు జాతీయ స్థాయికి వెళ్తున్నదని పేర్కొన్నారు మనీష్ సిసోడియా.