Telugu News

ఏఐసీసీ లో రాజస్తాన్ రగడ

ఏఐసీసీ రేసులోకి ఖర్గే, దిగ్విజయ్ సింగ్ పేర్లు

0

 

ఏఐసీసీ లో రాజస్తాన్ రగడ

== సచిన్ ఫైలెట్ వైపు అధిష్టానం మొగ్గు

== అడ్డుకునేందుకు అశోక్ గేహ్లాట్ టీమ్ ఎమ్మెల్యేలు రాజీనామాలు..?

== అధిష్టానం సీరియస్.. అశోక్ గేహ్లాట్ పోటీ నుంచి తప్పించే అవకాశం

== గెహ్లాట్ పై మండిపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు

== ఏఐసీసీ రేసులోకి ఖర్గే, దిగ్విజయ్ సింగ్ పేర్లు

== రోజురోజుకు మారుతున్న ఏఐసీసీ అధ్యక్ష పీఠం రాజకీయ పరిణామాలు

(హైదరాబాద్-విజయంన్యూస్)

ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆ పార్టీ నాయకులు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో  రాజస్తాన్ రూపంలో పిడుగుపడనే పడింది.. సీఎం అశోక్ గేహ్లాట్ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా సీఎం పదవి కోసం 92 మంది రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాజస్తాన్ ప్రభుత్వం సంక్షోభంలో పడినట్లైంది. మరో వైపు సీఎం పదవి కోసం సచిన్ పైలెట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడంతో రాజస్తాన్ పంచాయతీ కేంద్రానికి చేరింది. దీంతో ఏఐసీసీ వెంటనే స్పందించి ప్రభుత్వం పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి : ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం..?

రంగంలోకి దిగిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తక్షణమే మల్లిఖార్జున ఖర్గే, రాజస్తాన్ రాష్ర్ట ఇన్ చార్జ్ ఇద్దరు ఆ రాష్ట్రంలో పర్యటించి అసమత్తి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆశోక్ గేహ్లాట్ వర్గీయులు కొంత మెత్తబడినట్లే కనిపించినప్పటికి సచిన్ ఫైలేట్ సీఎంగా మేము ఒప్పుకునేది లేదన్నారు. దీంతో అశోక్ గేహ్లాట్ మూడు పేర్లు సూచించినట్లు సమాచారం. అయితే అసమ్మతి ఎమ్మెల్యేందరిని మల్లిఖార్జున్ ఖర్గే కలిసి వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా రాయించుకున్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లి ఆ రిపోర్టును సోనియాగాంధీకి వివరించనున్నారు.

== ఎందుకు రాజస్తాన్ లో ఇంత  రచ్చ..?

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏఐసీసీ అధ్యక్ష బరిలో రాజస్తాన్ సీఎం ఉన్నారు. ఆయన గాంధీ కుటుంబానికి సన్నిహితుడు, నమ్మిన బంటువుగా ఉండటం వల్ల దాదాపుగా ఆయనకే ఏఐసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అందరు అనుకున్నారు. ఈ మేరకు అశోక్ గేహ్లాట్ ఇటీవలే  సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసి పరిస్థితి వివరించారు. వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో జోడు పదవులు ఉండవని రాహుల్ గాంధీ తెల్చి చెప్పడంతో అశోక్ గేహ్లాట్ అధ్యక్ష పదవికి అర్హ్హుడైన మరుసటి రోజునే సీఎంకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో మొదటిలో రాజీనామా చేయనని గేహ్లాట్ పట్టుబట్టినప్పటికి రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. దీంతో అశోక్ గేహ్లాట్ తప్పని పరిస్థితుల్లో సీఎం పదవుకు రాజీనామా చేయాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో లేను: దిగ్విజయ్ సింగ్

ఈ క్రమంలో ముందుగానే సమాచారం అందుకున్న సచిన్ పైలేట్ సీఎం కావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఆయన గతంలోనే సీఎం పదవి ఇవ్వాల్సి ఉండగా, చివరి నిమిషంలో అశోక్ గేహ్లాట్ పేరు తెరమీదకు వచ్చి రాజస్తాన్ కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం రేకిత్తించారు. అందరు సీఎం సచిన్ ఫైలెట్ అనుకుంటున్న తరుణంలో అశోక్ గేహ్లాట్ పేరు తెరపైకి తీసుకరావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే చాలా మంది అలిగి కుర్చున్నారు. దీంతో రాహుల్ గాంధీ సచిన్ పైలేట్ కు నచ్చెజెప్పి పంచాయతీని సద్దుమనిగేలా చేశారు. ప్రస్తుతం ఏఐసీసీ నుంచి రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు ఇద్దరు రాజస్తాన్ పీఠం సచిన్ కు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా సచిన్ ఫైలెట్ కు వ్యతిరేకంగా అశోక్ గేహ్లాట్ కు సంబంధించిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో  రాజస్తాన్ కాంగ్రెస్ లో సంచలనంగా మారింది. సచిన్ సీఎం అయితే మా రాజీనామాలను ఆమోదించుకోవచ్చని స్పీకర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పంచాయతీ కాస్త ఏఐసీసీకి అంటుకుంది. దీంతో స్పందించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తక్షణమే రాజస్తాన్ కు మల్లిఖార్జున ఖర్గేను పంపించింది.

== అంతా అశోక్ గేహ్లాట్ వల్లనే ఈ సమస్య : మండిపడుతున్న సీనియర్లు

ఏఐసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడబోతున్న రాజస్తాన్ సీఎం అశోక్ గేహ్లాట్ వల్లనే రాజస్తాన్ లో సంక్షోభం వైపు ప్రభుత్వం వెళ్లిందన్నారు. ఆయన తన వర్గీయులను రెచ్చగొట్టడం వల్లనే వారందరు రాజీనామా చేశారని జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అశోక్ గేహ్లాట్ ఏఐసీసీ అధ్యక్ష  స్థానానికి అర్హుడు కాదని తెల్చిచెబుతున్నారు. అధ్యక్ష స్థానంలోకి అడుగు పెట్టే ముందు తన చేతులారా నోట్లో మన్నుపోసుకున్నట్లే అయ్యిందని ఆశోక్ గేహ్లాట్ పై సినియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

allso read- ఆస్ట్రేలియా పై భారత్ విక్టరీ

== ఏఐసీసీ రేసులో అశోక్ గేహ్లాట్ అవుట్..?

గాంధీ కుటుంబానికి విదేయుడిగా ఉన్న అశోక్ గేహ్లాట్ పై ఒక్కసారిగా ఆ కుటుంబమే సీరియస్ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్ష రేసు కోసం గాంధీ కుటుంబం మద్దతు తెలుపుతున్న సమయంలో అశోక్ గేహ్లాట్ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. భారతదేశ కాంగ్రెస్ పార్టీకి అద్యక్షుడు కావాల్సిన వ్యక్తి సీఎం సీటు కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: త్వరలో ఖమ్మం-సూర్యపేట నేషనల్ హైవే ప్రారంభం..?

ఏఐసీసీ నిర్ణయం మేరకు సీఎం స్థానాన్ని భర్తి చేయాల్సిన అశోక్ గేహ్లాట్ అదిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన వర్గీయులతో రాజీనామ హస్త్రాన్ని ఉపయోగించి రాజస్తాన్ ప్రభుత్వాన్ని సంక్షేమంలోనికి నెట్టారు. దీంతో అధిష్టానం అశోక్ గేహ్లాట్ పై చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అందుకు అశోక్ గేహ్లాట్ సోనియా, రాహుల్ గాంధీకి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికి అధిష్టానం సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. మొత్తానికి సీఎం అశోక్ గేహ్లాట్ అటు సీఎంగా కాకుండా, ఇటు ఏఐసీసీ అధ్యక్షుడిగా కాకుండా పోకచెక్కలా తయారైంది ఆయన పని అంటూ కొందరు సీనియర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు నేను ఏఐసీసీ రేసులో లేను అని చెప్పుకుంటున్న దిగ్విజయ్ సింగ్, మాజీపార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే లకు నామినేషన్ దాఖలు చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  చూడాలి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?