ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయనకే అభయహస్తం..?
== ఏకగ్రీవమయ్యే అవకాశం
== సోమవారం పెద్దల సమక్షంలో నామినేషన్ దాఖలు
== రాజస్తాన్ ముఖ్యమంత్రిగా యంగ్ లీడర్..?
== దాదాపుగా ఖారారు..?
(ఎడిటర్- పెండ్ర అంజయ్య)
(న్యూఢిల్లీ-విజయంన్యూస్)
ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అశోక్ గేహ్లాట్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న అశోక్ గేహ్లాట్ ను అధ్యక్ష స్థానంలో కుర్చోబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నామినేషన్ కూడా ఒక్కడే వేసే విధంగా జాతీయ కార్యవర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది..
ఇది కూడా చదవండి : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో లేను: దిగ్విజయ్ సింగ్
పూర్తి వివరాల్లోకి వెళ్తే చాలా ఏళ్ల తరువాత ఏఐసీసీ అధ్యక్ష్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నయి. ఈనెల 22న అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రీయ ప్రారంభం కాగా ఈనెల 30 వరకు గడువు ఉంది.. అక్టోబర్ 1న స్ర్కూట్ని జరగనుంది.. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది.. అయితే గత ఐదేళ్ల నుంచి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికలు జరిపించాలని జీ 23 డిమాండ్ చేయడం, 2019లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, గాంధీయేతర కుటుంబమే కావాలనే రాహుల్ గాంధీ పట్టుబడుతుండటంతో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు అనివార్యమైయ్యాయి.. దీంతో ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆ స్థానానికి పలువురు పోటీ పడే అవకాశాలున్నాయి.. ఇప్పటికే రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లాట్, శశిథరూర్ పోటీ పడుతున్నట్లు ప్రకటించగా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా పోటీ పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఆయన పోటీ చేయడం లేదని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏం చెబితే అది చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పడంతో పాటు పార్టీ నిర్ణయమే నా నిర్ణయమని స్పష్టం చేశారు.
దీంతో ఏఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కీలక నాయకులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దిగ్విజయ్ సింగ్ లాంటి గాంధీకుటుంబానికి విధేయుడు అలా స్పందించడంతో పోటీ చేయాలని ఆలోచన ఉన్నవారు కూడా విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే ఉండే అవకాశం ఉంది. అయితే 136ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పోలింగ్ జరిగితే బాగుండదని భావించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పాదయాత్రను ఒక రోజు వాయిదా వేసి నేరుగా ఢిల్లీ వెళ్లి అధ్యక్ష పదవిపై చర్చించారు. జాతీయ కార్యవర్గంలోని కీలక నాయకులతో మాట్లాడారు.. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవం చేస్తేనే భాగుంటుందని అందరు తమ అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది.
== ఆయనే అధ్యక్షుడు కన్పామ్
గాంధీ కుటుంబానికి విథేయుడు, వివాద రహితుడు, సౌమ్యుడు, ఎవరికి భయపడని వ్యక్తి, ప్రస్తుతం కష్టకాలంలో కూడా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లాట్ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఏఐసీసీ అధ్యక్షడు ఎవరు..?
ఆయన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ నాయకులు కూడా అశోక్ గేహ్లాట్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. పోటీలో ఉన్న శశిథరూర్ కు నచ్చజెప్పి ఒక్కటే నామినేషన్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోనియాగాంధీ శశిథరూర్ తో మాట్లాడినట్లు సమాచారం. ఆయన కొంత అసహానానికి గురైనప్పటికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషులు అంచనా వేస్తున్నారు. వచ్చే సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అందరి అమోదంతోనే నామినేషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కచ్చితంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైయ్యే చాన్స్ నూటికి నూరు శాతం ఉం
ది.
== రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలేట్ ..?
కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికి ఒక్కటే పదవి అని రాహుల్ గాంధీ చెప్పడంతో అశోక్ గేహ్లాట్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మరసటి రోజునే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సీఎంగా ఎవర్ని పెడతారనే విషయం పై రాజస్తాన్ పీసీసీ, ఏఐసీసీ తలమునకలు అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కీలక నేతలు కూడా సమావేశమై చర్చించినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సచిన్ ఫైలెట్ కే సీఎం పగ్గాలు వచ్చే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ మాటిచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సీఎం కోసం అశోక్ గేహ్లాట్, సచిన్ ఫైలెట్ పోటీ పడ్డారు. సీనియర్ కావడంతో సోనియాగాంధీ గేహ్లాట్ కే అవకాశం ఇచ్చింది. ఈ సమయంలో కొంత ఆందోళన చేసిన సచిన్ ఫైలెట్ కు రాహుల్ గాంధీ నచ్చజెప్పారు. ఆ సమయంలో మరోసారి కచ్చితంగా అవాకశం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం అశోక్ గేహ్లాట్ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత సచిన్ ఫైలెట్ రాజస్తాన్ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.