ఏఐసీసీ అధ్యక్షడు ఎవరు..?
== అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
== రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రీయ షూరు
== పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశోక్ గెహ్లాట్, శశిథరూర్, దిగ్విజయ్ సింగ్
== రేసులో లేనని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
== ఎవరికి సపోర్టు చేయనని స్పష్టం చేసిన సోనియాగాంధీ
== ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ చర్చలు
(ఎడిటర్- పెండ్ర అంజయ్య)
(హైదరాబాద్-విజయంన్యూస్)
అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 17న అధ్యక్ష పదవి భర్తి కోసం ఎన్నిక జరగనుంది. అయితే 20 ఏళ్ల తరువాత ఏఐసీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది.. ఎప్పుడు గాంధీ కుటుంబమే ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతుండగా, ఒక్కటి, రెండు సార్లు మాత్రమే గాంధీయేతర వ్యక్తులు అధ్యక్ష రేసులో పనిచేశారు.
allso read- ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు టోకరా
ఆ తరువాత తిరిగి గాంధీ కుటుంబమే ఆ బాధ్యత తీసుకున్న పరిస్థితి. అయితే 20 ఏళ్ల తరువాత మరోసారి ఏఐసీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఏర్పడింది.
== రేసులో లేనని స్పష్టం చేసిన రాహుల్
ఏఐసీసీ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టాలని జాతీయ కాంగ్రెస్ కార్యకర్గంతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పటికే ఆయన అధ్యక్ష స్థానాన్ని అదిరోహించాలని కోరుతూ 13 పీసీసీలు ఏకగ్రీవంగా తీర్మాణం చేసిన పరిస్థితి నేలకొంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పీసీసీ కార్యకవర్గం కూడా తీర్మాణం చేసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖను పంపించారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఆ పదవికి సుముక్తత చూపించడం లేదు. గాంధీయేతర కుటుంబానికి ఏఐసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను అప్పగించాలని జీ 23 టీమ్ సభ్యులు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆనాటి నుంచి నేటి వరకు ఒకే మాటపై ఉన్నారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఆ తరువాత తిరిగి అధ్యక్ష స్థానాన్ని తీసుకోవాలని నాయకత్వం బ్రతిమిలాడిన ఆయన ససేమేరా అంటూ తిరస్కరించారు.
allso read- మునుగోడులో బిజెపి,టీఆర్ఎస్ లను ఓడించాలి: భట్టి విక్రమార్క
అనంతరం ఆ బాధ్యతను సోనియాగాంధీకి అప్పగించారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో గాంధీ కుటుంబంపై ఆ పార్టీకి చెందిన నేతలు విమ్మర్శలు చేసిన నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికలను నిర్వహించాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు అనేక సార్లు సమావేశాలు నిర్వహించినప్పటికి వీలు కాలేదు. కాగా అక్టోబర్ 17న ముహూర్తాన్ని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోగా, ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం అధ్యక్ష స్థానానికి నేను రేసులో లేనని స్పష్టంగా ప్రకటించారు. సోనియాగాంధీ కూడా అధ్యక్షరేసులో లేనని, గాంధీయేతర కుటుంబానికి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఎన్నిక తప్పదేమోననే సంకేతాలు కనిపిస్తున్నాయి..
== అధ్యక్ష పోటీకి సీనియర్ నేతల ప్రయత్నాలు
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు సీనియర్ నాయకులు నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు రాజస్తాన్ సీఎం ఆశోక్ గేహ్లాట్, శశిథరూర్ పోటీ చేసేందుకు ముందుకు రాగా, ప్రస్తుతం దిగ్గ్విజయ్ సింగ్, శివకుమార్ కూడా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశోక్ గేహ్లాట్, శశిథరూర్ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి నామినేషన్ ప్రక్రియపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే గురువారం సమావేశం అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు.
== ఢిల్లీలో సోనియా, రాహుల్ సమావేశం
భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ గురువారం ఒక్క రోజు విరామం ఇచ్చి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేసే ప్రక్రీయపై తల్లి సోనియా గాంధీతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లగా, అక్కడ జాతీయ కార్యవర్గంతో పాటు సోనియాగాంధీతో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించారు. నామినేషన్ ప్రక్రీయ పై చర్చించారు. ఎన్నికలు కాకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గాను సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకరావాలంటే అధ్యక్ష ఎన్నికల ప్రక్రీయ పూర్తి చేసుకోవాలనే రాహుల్ గాంధీ నిర్ణయానికి పార్టీ ఏకపక్షంగా ఆమోదించింది. ఈ మేరకు అధ్యక్ష పదవి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
== అసక్తిగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఏఐసీసీ అధ్యక్షుడు ఎవరు అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నేలకొంది. రాహుల్ గాంధీ రేసులో లేనని చెప్పడంతో గాంధీయేతర కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదనిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీని 50ఏళ్ల పాటు ముందుండి నడిపించిన గాంధీ కుటుంబం ఈ రోజు వైదోలగడం పై కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి నాయకత్వం కొంత ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే సందేహాలు అందరి మదిని కదిలిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబాన్ని తీసుకుంటే మరీ రాహుల్ గాంధీ ఏఐసీసీలో ఏ పదవి తీసుకుంటారు, సోనియా గాంధీకి ఏ పదవి ఇస్తారనే విషయంపై స్పష్టత రాకపోయినప్పటికి వాళ్లే ఏ పదవులు తీసుకుంటారో అని పార్టీ కింది స్థాయి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ చైతన్యం కల్గిన, కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..?చూద్దాం.. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..?