ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గ్రీన్ సిగ్నల్
== అతి త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
== ఏఐసీసీ సమావేశంలో నిర్ణయించిన కాంగ్రెస్ నేతలు
(న్యూఢిల్లీ-విజయంన్యూస్)
భారత కాంగ్రెస్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ వర్కంగి కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం న్యూఢిల్లీలోని సోనియా గాందీ నివాసంలో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయి ముఖ్యనాయకులు హాజరైయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు జాతీయ స్థాయి నాయకత్వం హాజరైయ్యారు. కాగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమీక్ష చేశారు. అలాగే అతి త్వరలో రాహుల్ గాంధీ నిర్వహించే పాదయాత్ర పై చర్చించారు. అయితే వీటన్నింటికి ప్రధానమైన అంశంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పై చర్చ జరిగింది. సోనియాగాంధీ అదేశాల మేరకు అతి త్వరలోనే ఎన్నికలను నిర్వహించాలని ఏఐసీసీ కమిటీ నిర్ణయం తీసుకుంది.
allso read- నేడు భారత్,పాక్ క్రికెట్ మ్యాచ్
== త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు ఏఐసీసీ నిర్ణయించి ఎన్నికల నోటిఫికేషన్ తేదిని ఖారారు చేస్తూ షెడ్యూల్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న ఏఐసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలకు నిర్వహాకులకుగా మిస్ర్తీ కొనసాగుతున్నారు. ఆయన వచ్చేనెల 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎన్నికల పరిశీలకులను నియమించే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికకు గాంధీ కుటుంబం నుంచే నామినేషన్లు వేస్తారా..? లేదంటే గాంధీయేతర కుటుంబం నామినేషన్ వేస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది.