Telugu News

ఓటమికి సోనియా ఒక్కరినే బాధ్యులను చేయలేం

కాంగ్రెస్‌ నేతలంతా ఇందుకు బాధ్యులే

0

ఓటమికి సోనియా ఒక్కరినే బాధ్యులను చేయలేం
== కాంగ్రెస్‌ నేతలంతా ఇందుకు బాధ్యులే
== రాజీనామాకు సోనియా సిద్దంగా ఉన్నా సీడబ్ల్యూసీ తిరస్కరణ
== కాంగ్రెస్‌ నేతలు అధీర్‌ రంజన్‌,మల్లికార్జుఖర్గే
(న్యూఢల్లీ-విజయంన్యూస్)
కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ తన పదవి నుంచి తప్పుకునేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ అన్నారు. పార్టీ కోసం తమ పోస్టులను త్యాగాలు చేసేందుకు సోనియా ఫ్యామిలీ రెడీగా ఉందన్నారు. ఆదివారం జరిగిన పార్టీ విూటింగ్‌ లో తాను బాధ్యతల నుంచి తప్పించుకుంటానని సోనియా చెప్పారని.. కానీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) అందుకు ఒప్పుకోలేదన్నారు. సోనియానే పార్టీ చీఫ్‌ గా కొనసాగాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్‌ ఛార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. ఆమె సారథ్యంలో వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధానంగా సంస్థాగత బలహీనతలు అధిగమించి, పార్టీలో సమగ్రమైన మార్పులు తీసుకురావాలని సోనియాకు వివరించామన్నారు.

also read;-ఎరుపెక్కిన భద్రాచలం

ఇటీవల జరిగిన ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్‌ పార్టీ. కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడిరది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమవుతుందనే భావనలో ఉన్న అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ పునర్నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రజా ఉద్యమాలు చేపట్టి.. పార్టీ బలోపేతంపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ విూటింగ్‌ లో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. వ్యూహాలు పక్కాగా అమలు చేయకపోవడంతోనే ఓడిపోయామని కాంగ్రెస్‌ పెద్దలు అంగీకరించారు. దీన్ని సవాలుగా తీసుకుని ముందుకెళ్లాలని ధీమా వ్యక్తం చేశారు.

also read;-తెలంగాణలో జిల్లాలో కాలేజీకి సిఎం కెసిఆర్‌ శ్రీకారం: హారీష్ రావు
ఎన్నికల్లో పార్టీ ఓటమికి అగ్ర నాయకత్వమే కాకుండా ఆయా రాష్టాల్ర ఎంపీలతో పాటు పార్టీ నేతలందరూ బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ఎన్నికల ఫలితాల్లో పార్టీ పరాజయానికి మనం సోనియా గాంధీ ఒక్కరినే బాధ్యులుగా చేస్తూ మాట్లాడుతున్నామని ఈ ఓటమికి కేవలం గాంధీ కుటుంబమే కాదు..ప్రతి రాష్ట్ర నేత, ఎంపీ బాధ్యులని ఖర్గే స్పష్టం చేశారు. సోనియా నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేశామని, ఆమె రాజీనామా చేసే ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. మార్చి 10న ప్రకటించిన పంజాబ్‌, గోవా, యూపీ, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని చెప్పారు. బీజేపీతో పాటు ఆ పార్టీ సిద్దాంతాలతో తాము పోరాడుతామని, రానున్న ఎన్నికల్లో తాము మరింత మెరుగైన ఫలితాలు రాబడతామని ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు.