అసమానతలపై అంబేడ్కర్ అలుపెరగని పోరు
ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత అభ్యున్నతికి కృషి
అసమానతలపై అంబేడ్కర్ అలుపెరగని పోరు
—ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత అభ్యున్నతికి కృషి
—టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
(ఖమ్మం -విజయం న్యూస్):-
బాబాసాహెబ్ గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అణగారినవర్గాల అభ్యున్నతి, అసమానలతపై అలుపెరగని పోరాటం చేశారని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 14న ఆయన జయంతి పురస్కరించుకోని ఈ సందర్భంగా ఎంపీ నామ ఆయన మహానీయుడికి నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ నామ మీడియాకు ఒక ప్రకటన విడుడల చేశారు. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికతకోసం తన జీవితం చివరి వరకూ అంబేడ్కర్ పోరాటం చేశారని ఆయన వివరించారు.
also read :-బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్ : మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి
రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, ఆర్థికవేత్త, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. జీవితాంతం అణగారినవర్గాల కోసం పోరాడి, వారికి ఆశాజ్యోతిగా అంబేడ్కర్ నిలిచారని గుర్తుచేశారు.
also read :-దళితులకు అవమానం..
కుల, మత రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని కొనియాడారు. దళితుల నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేడ్కర్ చేసిన పోరాటం మరువలేనిదని వ్యాఖ్యానించారు. ఆ మహానీయుడి స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వివరించారు. దళితబంధు వంటి విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి అణగారినవర్గల ప్రజానీకాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.