Telugu News

ఆటో డ్రైవర్‌ ఆహ్వానం.. ఆటోలో ఇంటికెళ్లి భోజనం చేసిన సీఎం

డిగ్రూప్ చండీగఢ్‌

0

ఆటో డ్రైవర్‌ ఆహ్వానం.. ఆటోలో ఇంటికెళ్లి భోజనం చేసిన సీఎం.

డిగ్రూప్ చండీగఢ్‌: పంజాబ్‌ పర్యటనలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. సీఎం తన ఇంటికి భోజనానికి రావాలని ఓ ఆటో డ్రైవర్‌ కోరగా.. అతడి ఆహ్వానాన్ని మన్నించారు కేజ్రీవాల్‌. స్వయంగా అతడి ఆటోలోనే డ్రైవర్‌ ఇంటికి వెళ్లారు. అతడితో పాటు నేలపై కూర్చుని భోజనం చేసి ఆటోడ్రైవర్‌ను సంతోషపెట్టారు.

aalso read :- తాతా మధుసూధన్ విజయం ఖాయం..