Telugu News

ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం.

ఏన్కూరు విజయo న్యూస్

0

ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం.

(ఏన్కూరు విజయo న్యూస్):-

ఏన్కూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,బాలుర గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో శనివారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 194 మంది విద్యార్థులకు గాను ఏడుగురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ పరీక్షకు 74 మంది గాను 71 మంది హాజరయ్యారు. బాలుర గురుకుల కళాశాలలో 231 మంది విద్యార్థులకు గాను 216 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపర్నెంట్ గా శ్రీనివాస్ రెడ్డి, సుందరం డిపార్ట్మెంట్ అధికారులుగా కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్ వ్యవహరించారు.