Telugu News

బుల్లెట్ పైఇంటింటికి మంత్రికళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణి

ఘనంగా స్వాగతంపలికిన  లబ్దిదారులు

0

బుల్లెట్ పైఇంటింటికి మంత్రికళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణి

ఘనంగా స్వాగతంపలికిన  లబ్దిదారులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-

పేదింటి ఆడపడచు పెండ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, /షాదిమూభారక్ ద్వారా ఆర్ధికంగాఆదుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారంఖమ్మం కార్పోరేషన్ పరిధిలో మంజూరైన 107 కళ్యాణలక్ష్మి, /షాదిమూభారక్ చెక్కులకు గాను రూ.1.07 కోట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కులకు గాను రూ.18.73 లక్షల విలువైన 33 చెక్కులను రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుల్లెట్ పై ప్రయాణించి ఇంటింటికి వెళ్లి నగర మేయర్పునుకొల్లు నీరజతో కలసి మంత్రి నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

also read :-పేదలకు. విలేకరులకు మధ్యతరగతి కుటుంబాల వారికి రాజీవ్ స్వగృహ ను కేటాయించాలి

ఖమ్మం నగరంఒకటవ టౌన్ పరిదిలో 15, 16, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 37, 38, 41, 42, టుటౌన్ పరిధిలో 43, 44,45, 49, 50, 51, 52, 53, 55, 57, 58 డివిజన్ల నందు ముఖ్యమంత్రి సహయనిధి, కళ్యాణ లక్ష్మి, |షాదిమూభారక్ చెక్కులను మంత్రిపంపిణి చేశారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడతూ పెద నిరుపేద కుటుంబాల ఆడపిల్లపెండ్లి తల్లిదండ్రులకు ఆర్ధిక భారం కాకూడదనే సంకల్పంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అలోచనచేసి కళ్యాణ లక్ష్మి, /షాదిమూభారక్ పథకాన్ని అమలుచేస్తున్నారని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడాచైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం అర్బన్ తహాశీల్దారు శైలజ, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులుతదితరులు పాల్గొన్నారు.