Telugu News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..*

0

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

== భయపడిన ప్రయాణికులు..

*మెయిల్ చేసిన దుండుగులు..*

*అత్యవసరంగా ప్రయాణికులను దింపేసిన పోలీసులు..*

*ఎమర్జెన్సీ కిటికీల నుంచి దిగిన ప్రయాణికులు..*

*తనిఖీ చేపట్టిన బాంబ్ స్క్వాడ్, పోలీస్ బృందాలు..*

*ఐసోలేషన్ కు విమానం తరలింపు..*

*ఉదయం 5గంటల సమయంలో సంఘటన*

ప్రయాణికులు సురక్షితం

ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న విమానం 

(న్యూఢిల్లీ -విజయం న్యూస్)

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయంకు అత్యవసరం మెయిల్ రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి ప్రయాణికులను ఎమర్జెన్సీ కిటికీలు ద్వారా కిందికి దింపేశారు. ఢిల్లీ నుంచి వారణాసి కి వెళ్తున్న ఇండిగో విమానం వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విమానాశ్రయానికి ఎమర్జెన్సీ మెయిల్ రావడం ఆ మెయిల్ చూసిన సిబ్బంది తక్షణమే పోలీసులకు సమాచారం అందించ  విమానాన్ని నిలిపివేశారు. కాగా బాంబు బెదిరింపుతో విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. పరుగులు పెట్టే ప్రయత్నం చేయగా తక్షణమే స్పందించిన సిబ్బంది ప్రయాణికులకు దైర్యం చెప్పి ఎమర్జెన్సీ కిటికీల ద్వారా కిందకు దింపేశారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, పోలీస్ సిబ్బంది తక్షణమే విమానం చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు సుమారు రెండు గంటలపాటు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం 5గంటలకు జరిగింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..