Telugu News

ఆసియా ఖండంలోనే అద్భుత కట్టడం బుద్ధవనం

స్థిర చిత్త బౌద్ధ సంస్థ అధ్యక్షులు కే కే రాజా

0

ఆసియా ఖండంలోనే అద్భుత కట్టడం బుద్ధవనం

* స్థిర చిత్త బౌద్ధ సంస్థ అధ్యక్షులు కే కే రాజా

(నాగార్జునసాగర్ – విజయం న్యూస్);-
విలక్షణ బౌద్ధ శిల్ప కళతో బౌద్ధ వారసత్వంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్ లో నిర్మిస్తున్న బుద్ధవనం ఆసియా ఖండంలోనే అద్భుతమైన కట్టడం అని స్థిర చిత్త బౌద్ధ సంస్థ అధ్యక్షులు కే కే రాజా అన్నారు. అంతర్జాల మాధ్యమం ద్వారా గత రెండు సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో వందకుపైగా బౌద్ధ ప్రసంగాలు నిర్వహించిన సందర్భంగా ఆయన బుధవారం నాడు నాగార్జున సాగర్లోని బుద్ధ వనం ప్రాజెక్టును సందర్శించారు.

also read;-టేకులతండాలో భారీ అగ్ని ప్రమాదం

ఈ సందర్భంగా బుద్ధవనం లో ప్రధాన ఆకర్షణగా నిలిచే బుద్ధవనం ప్రాజెక్టు ప్రవేశ ప్రాంతము , బుద్ధుని పాదాలు ,బుద్ధ చరిత వనం ,జాతక వనం, శ్రీలంక బుద్ధ విగ్రహం ఉన్నటువంటి ద్యానవనం, మహా స్తూపము ,స్థూప వనo, అమరావతి రెయిలింగ్, రోహిణి నది జలాల వివాద శిల్పాలు గురించి చారిత్రక పరిశోధకుడు బుద్ధవనం ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి ఆయన వివరించారు. వీరితో పాటు బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి,క్రాంతి బాబు ,దామోదర్ రెడ్డి తదితరులు ఉన్నారు..